తెలుగు ఇండస్ట్రీకి ఇప్పుడు టైమ్ బాగానే ఉంది. వచ్చిన పెద్ద సినిమాలు బాగానే ఆడుతున్నాయి. సమ్మర్ లో రంగస్థలంతో రచ్చ మొదలైంది. అది బ్లాక్ బస్టర్.. నాన్ బాహుబలి రికార్డులు అన్నీ తన పేరు మీద రాయించేసుకున్నాడు రామ్ చరణ్. ఇక భరత్ అనే నేను కూడా బాగానే ఆడుతుంది. ఈ చిత్రం కూడా ఇప్పటి వరకు 90 కోట్ల వసూళ్లు రాబట్టింది.
ఈ క్రమంలోనే తన అదృష్టం పరీక్షించుకోడానికి వచ్చేస్తున్నాడు అల్లు అర్జున్. ఈయన గతేడాది డిజేతో యావరేజ్ దగ్గరే ఆగిపోయాడు. కానీ ఆ సినిమా 70 కోట్లకు పైగా వసూలు చేసి బన్నీ స్టామినా ఏంటో చూపించింది. ఇక ఇప్పుడు నా పేరు సూర్యతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ అందుకుని.. 100 కోట్ల వైపు పరుగులు తీయాలని చూస్తున్నాడు. ఇప్పటికే బిజినెస్ లో రికార్డులు సృష్టి స్తున్నాడు అల్లు వారబ్బాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్ర థియెట్రికల్ రైట్స్ 85 కోట్లకు అమ్ముడవగా.. మిగిలిన రైట్స్ తో కలిపి 112 కోట్లు అయింది. ఇప్పుడు సినిమా హిట్ అనిపించుకోవాలన్నా కూడా 85 కోట్లు రావాలి. మరోవైపు మే 4న సినిమా దాదాపు 2000 స్క్రీన్స్ లో విడుదల కానుంది. ఓవర్సీస్ లో కూడా భారీగానే వస్తుంది ఈ చిత్రం. అక్కడ డిజే.. సరైనోడు ఫ్లాప్.. కనీసం ఈ చిత్రంతో హిట్ కొట్టి మళ్లీ తన సత్తా నిరూపించుకోవాలనే కసితో ఉన్నాడు బన్నీ. చూడాలి.. ఈయనేం చేస్తాడో ఇక..!