పూరీ జగన్నాథ్ సినిమా అంటే కనీసం ఓపెనింగ్స్ వస్తాయి. సినిమా ఎలా ఉన్నా ముందు కొన్ని కలెక్షన్లు అయితే వస్తాయి. కానీ ఇప్పుడు అవి కూడా కనిపించట్లేదు. అసలు తొలిరోజు సాయంత్రానికే థియేటర్స్ ఖాళీ అయిపోతున్నాయి. అసలు ఎలాంటి పూరీ జగన్నాథ్.. ఎలా అయిపోయాడే అంటూ బాధ పడుతున్నారు ఆయన అభిమానులు. తాజాగా ఈయన తెరకెక్కించిన మెహబూబా అయితే దారుణంగా పడిపోయింది. కనీసం నామమాత్రపు వసూళ్ళు కూడా తీసుకురాలేక పూర్తిగా చేతులెత్తేసింది ఈ చిత్రం. ఆకాశ్ ను హీరోగా పరిచయం చేస్తూ పూరీ తెరకెక్కించిన ఈ చిత్రం డిజాస్టర్ కా బాప్ అయిపోయింది. దిల్ రాజు విడుదల చేసినా కూడా కనీసం పట్టించుకోవడం లేదు ప్రేక్షకులు. మరోవైపు మహానటి థియేటర్స్ లో దంచేస్తుంటే.. అలా చూస్తుండిపోయింది మెహబూబా. ఆకాశ్ బాగానే చేసినా.. పూరీ మరోసారి రొటీన్ స్క్రీన్ ప్లేతో రావడంతో ఎటూ కాకుండా పోయింది ఈ చిత్రం. మూడు రోజుల్లో కనీసం 3 కోట్ల మార్క్ కూడా అందుకోలేదు ఈ చిత్రం. ఇక ఓవర్సీస్ అయితే వచ్చిన వసూళ్లు చెప్పుకోకపోతేనే మంచిది. ఈ చిత్రానికి వచ్చిన వసూళ్ల కంటే కొత్తహీరోతో కొత్త దర్శకుడు చేసినా వచ్చే వసూళ్లు ఎక్కువగా ఉంటాయేమో..? అంత దారుణంగా మారిపోయింది పరిస్థితి. మరి చూడాలి.. పూరీ ఇంకెప్పుడు దారిలో పడతాడో..?