శ్రీకాంత్ సినిమా అంటే హీరో శ్రీకాంత్ కాదండీ బాబూ..! దర్శకుడు శ్రీకాంత్.. శ్రీకాంత్ అడ్డాల. రెండేళ్ల కింద బ్రహ్మోత్సవంతో డిజాస్టర్ ఇచ్చాడు ఈ దర్శకుడు. ఆ తర్వాత కనీసం కనిపించడం కూడా మానేసాడు. ఒక్కటి రెండు కాదు.. ఏకంగా 35 కోట్లకు పైగా నష్టాలు తీసుకురావడంతో శ్రీకాంత్ అడ్డాలపై నమ్మకాలన్నీ పోయాయి. బ్రహ్మోత్సవం తర్వాత మనోడు ఏ సినిమాకు కూడా కమిట్ కాలేదు.
ఆ మధ్య మెగా కుటుంబంలో ఉన్నాడని.. అక్కడ వరుణ్ తేజ్ తో సినిమాకు సిద్ధమవుతున్నాడనే వార్తలు వచ్చాయి కానీ మళ్లీ ఆ తర్వాత ఆ వార్తలేవీ వినిపించలేదు. ఇక ఇప్పుడు ఈయన చూపులు శర్వానంద్ పై పడ్డాయని తెలుస్తుంది. ఇప్పటికే ఓ కథ సిద్ధం చేసి శర్వాకు వినిపించాడని వార్తలు వినిపిస్తున్నాయి. శర్వానంద్ కూడా ఈ కథపై బాగానే మనసు పడ్డాడని తెలుస్తుంది. మరి చూడాలిక.. శర్వానంద్ సినిమాతో అయినా శ్రీకాంత్ అడ్డాల కెరీర్ గాడిన పడుతుందో లేదో..?