మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం నిర్మిస్తున్న చిత్ర షూటింగ్ చివరి దశలో ఉండగా, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. నేటి నుండి హీరో కళ్యాణ్ దేవ్ డబ్బింగ్ ప్రారంభించారు. రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కళ్యాణ్ దేవ్ కు జోడీగా “ఎవడే సుబ్రమణ్యం” ఫేమ్ మాళవిక నాయర్ నటించారు. చిత్ర టైటిల్ మరియు రిలీజ్ ను త్వరలో ప్రకటిస్తారు.
రాకేష్ శశి ఒక వినూత్నమైన కాన్సెప్ట్ తో కథ అందించిన ఈ చిత్రం ఎక్కడా రాజీపడకుండా భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కించారు. “బాహుబలి” వంటి ప్రతిష్టాత్మక చిత్ర కెమెరా మ్యాన్ సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తించారు.”రంగస్థలం” చిత్రంతో కళా దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రామకృష్ణ ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేసారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.
తారాగణం:
కళ్యాణ్ దేవ్, మాళవికా నాయర్, తనికెళ్ళభరణి, మురళీ శర్మ, నాజర్, సత్యం రాజేష్, ప్రగతి, కళ్యాణి నటరాజన్, పోసాని కృష్ణమురళి, రాజీవ్ కనకాల, జయప్రకాష్ (తమిళ నటుడు), ఆదర్ష్ బాలకృష్ణ, నోయల్, కిరీటి, భద్రమ్ తదితరులు.
సాంకేతిక నిపుణులు:
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: రాకేష్ శశి
నిర్మాత: రజిని కొర్రపాటి
సాయి కొర్రపాటి నిర్మాణ సారథ్యంలో
సమర్పణ: సాయి శివాని
ఛాయాగ్రాహకుడు: కె.కె. సెంథిల్ కుమార్
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
లిరిక్స్: రెహమాన్, రామజోగయ్య శాస్త్రి
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
ఆర్ట్ డైరెక్టర్: రామకృష్ణ
ఫైట్స్ : జాషువు