దిశాపటాని.. ఈ పేరుకు ఇండస్ట్రీలో కంటే బయటే ఎక్కువగా ఇమేజ్ ఉంది. ఎందుకంటే ఎప్పుడూ సోషల్ మీడియాలో ఏదో ఓ రచ్చ చేస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా హాట్ పోజులతో అమ్మడు చేసే రచ్చకు సోషల్ మీడియా వేడెక్కుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా ఇదే చేసింది.
తాజాగా ఓ మ్యాగజైన్ కవర్ పేజీపై అమ్మడు మరోసారి రెచ్చిపోయింది. తన ఫిట్ నెస్ ఏంటో చూపించడానికి మత్తెక్కించే క్యాస్ట్యూమ్ లో మతులు పోగొడుతుంది ఈ ముద్దుగుమ్మ. మొక్కల మధ్య అందాలన్నీ కెమెరాకు పరిచేసింది దిశా. ఈ ముద్దుగుమ్మ దూకుడు చూసి వామ్మో అనుకోని వాళ్లుండరేమో..? అంతగా రెచ్చిపోతుంది దిశా. ఈ భామ అందాలు.. అవకాశాల ఆర్తనాదాలు చూసి సల్మాన్ ఖాన్ కరుణించాడు.
ఈ హీరోతో త్వరలోనే నటించబోతుంది దిశాపటానీ. అలీఅబ్బాస్ జాఫర్-సల్మాన్ కాంబినేషన్ లో రాబోయే భరత్ సినిమాలో దిశాను ఓ హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా మెయిన్ హీరోయిన్. మొత్తానికి అందాల ఆరబోత ఇన్నాళ్లకు దిశాకు పనికొచ్చిందన్నమాట.