బాహుబలి తర్వాత ప్రభాస్ తెలుగు హీరో కాదు. ఇప్పుడు ఈయన ఇండియన్ హీరో. బాలీవుడ్ హీరోలకు కూడా సాధ్యం కాని రికార్డులను చాలానే సెట్ చేసాడు ఈయన. దాంతో ఇటు తెలుగు.. అటు హిందీలో మార్కెట్ సొంతం చేసుకుని సరికొత్త సూపర్ హీరో అయ్యాడు ప్రభాస్. అందుకే సాహో సినిమాతో అది అలాగే నిలబెట్టుకోవాలని చూస్తున్నాడు ప్రభాస్. ఇప్పుడు ఆయన రేంజ్ కూడా అలా పెరిగిపోయింది మరి. అందుకే సాహోకు ఏ మాత్రం వెనకాడకుండా 200 కోట్ల బడ్జెట్ ఇచ్చారు యువీ క్రియేషన్స్. సుజీత్ చెప్పిన కథను ప్రభాస్ కూడా అదే రేంజ్ లో నమ్మాడు. ఇక ఇప్పుడు ఈ చిత్ర దుబాయ్ షెడ్యూల్ పూర్తయింది. అక్కడ ఏకంగా నెల రోజుల పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించాడు దర్శకుడు సుజీత్. ఇందులో 37 కార్లు.. 4 భారీ ట్రక్కులు కూడా ఉన్నాయి. ఇవన్నీ సీక్వెన్స్ లో భాగంగా నిజంగా తీసుకొచ్చి వాటిని క్రష్ చేసారు. ఈ షెడ్యూల్ కోసం ఏకంగా 90 కోట్లు ఖర్చు చేస్తున్నారు నిర్మాతలు.
25 నిమిషాల భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం 90 కోట్లు ఖర్చు పెట్టిస్తున్నాడు సుజీత్. స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్స్ ఈ చిత్రం కోసం భారీ యాక్షన్ సీక్వెన్సులు ప్లాన్ చేస్తున్నాడు. దుబాయ్ లో బూర్జ్ ఖలీఫా దగ్గర ఈ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించారు. ఇండియన్ సినిమాల్లోనే నెవర్ బిఫోర్ అన్నట్లుగా ఇది ఉంటుందంటున్నాడు ప్రభాస్. తాజాగా ఆయన దుబాయ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులోనే మాట్లాడుతూ దుబాయ్ కు థ్యాంక్ యూ చెప్పాడు. దుబాయ్ అయిపోయింది.. ఇప్పుడు రుమేనియా వెళ్లనున్నారు యూనిట్. అక్కడ ప్లాన్ చేసిన కార్ సీక్వెన్సులు పిచ్చెక్కించబోతున్నాయి. ఈ చిత్రం కచ్చితంగా ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో బెస్ట్ యాక్షన్ మూవీగా నిలిచిపోతుందని భావిస్తున్నారు. 2019లో ఈ చిత్రం విడుదల కానుంది. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది.