శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీకి వస్తుంది ఝాన్వీకపూర్. ఇప్పటికే ఈ భామకు బోలెడంత క్రేజ్ వచ్చింది. పైగా తల్లి లేని పిల్ల అంటూ ఈ మధ్య కాస్త సింపతీ కూడా వచ్చింది. వీటన్నింటినీ తన కెరీర్ కు మెట్లుగా వేసుకుంటుంది ఝాన్వీ కపూర్. ఇన్నాళ్లూ సినిమాతోనే బిజీగా ఉన్న ఝాన్వీ..
ఇక ఇప్పుడు ఫోటోషూట్లపై దృష్టి పెట్టింది. తొలి సినిమా ధడక్ షూటింగ్ పూర్తి కావడంతో ఆ సినిమా ప్రమోషన్ తో పాటు తన ప్రమోషన్ ను కూడా మొదలు పెట్టింది ఝాన్వీకపూర్. తాజాగా ఈ భామ వోగ్ మ్యాగజైన్ కోసం ఫోటోషూట్ చేసింది. హాట్ హాట్ గా లేత అందాలన్నీ ఆరబోస్తూ ఝాన్వీ ఇచ్చిన పోజులు చూస్తుంటే అబ్బో పిల్ల బాగా ముదిరిపోయిందే అనుకుంటున్నారు. కచ్చితంగా అతిలోకసుందరి అసలైన వారసురాలు ఝాన్వీనే అనిపిస్తుంది తన అందాలతో. మరి చూడాలిక.. అమ్మ కోరికను ఈ జూనియర్ శ్రీదేవి ఎంతవరకు నిలబెడుతుందో..?