తమిళనాట ఎప్పుడూ ట్రెండింగ్ టాపిక్ ఇది. ఆయన ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తాడా అని అభిమానులు వేచి చూస్తున్నారు. ఆయన తండ్రి చంద్ర శేఖర్ కూడా విజయ్ రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని చెప్పాడు. అయితే ఇప్పుడు తనకు ఆ ఉద్ధేశ్యం లేదంటున్నాడు ఇళయ దళపతి. దానికి మరో కారణం కూడా ఉంది. రజినీకాంత్ పిలిచి మరీ నీకు ఇంకా పదేళ్లు టైమ్ ఉంది.. ముందు సినిమాలు చేయ్ అంటూ అప్పట్లో బాగానే విజయ్ క్లాస్ ఇచ్చాడని కోలీవుడ్ లో మాటలు వినిపించాయి. ఆ మాటలు వినే తన దృష్టంతా సినిమాలపై పెట్టాడు విజయ్.
అయితే తాను చేయాల్సిన సేవలు మాత్రం హీరోగా ఉండే చేస్తున్నాడు ఈ హీరో. ఇప్పటికే అభిమాన సంఘాల నుంచి కూడా ఈ హీరోకు కావాల్సినంత సపోర్ట్ ఉంది. ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు విజయ్ పొలిటికల్ హీట్ పై మరోసారి వార్తలు మొదలయ్యాయి. దానికి కారణం మురుగదాస్. ఈయన సినిమాలో ఇప్పుడు విజయ్ పొలిటీషియన్ గా నటిస్తున్నాడని తెలుస్తుంది. ఈ పాత్రకు కావాల్సినట్లుగానే మారిపోతున్నాడు విజయ్.
ఈ మధ్యే విడుదలైన పోస్టర్స్ లో కూడా బ్యాగ్రౌండ్ లో రాజకీయాలకు సంబంధించిన లుక్స్ విడుదలయ్యాయి. ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని తెలుస్తుంది. మరి చూడాలిక.. రియల్ లైఫ్ లో ఎలాగూ రాజకీయాల్లోకి ఇప్పట్లో వచ్చేలా లేడు.. సినిమాలో ఏం చేస్తాడో చూడాలిక..!