కాలాను కావాల‌నే టార్గెట్ చేస్తున్నారా..?

 
Rajinikanth Kaala
ఏమో ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మ‌రి. లేక‌పోతే మ‌రేంటి.. విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ ఒక్కో వివాదం ఇంకా దీని చుట్టూ ముసురుతుంది కానీ ఫ్రీ కావ‌డం లేదు. మొన్న‌టి వ‌ర‌కు ఒక్క క‌ర్ణాట‌క కాంట్ర‌వ‌ర్సీ మాత్ర‌మే ఉంది అనుకున్నారు కానీ ఇప్పుడు మ‌రో రెండు వ‌చ్చి చేరాయి. ఈ చిత్రాన్ని ఇప్పుడు నార్వే, స్విట్జ‌ర్లాండ్ ల‌లో కూడా విడుద‌ల చేయ‌డం లేదు.
దానికి కార‌ణం కూడా ఉంది. ర‌జినీకాంత్ ఈ మ‌ధ్యే నార్వే కంపెనీ త‌మిళ‌నాడులో ఉండ‌టంపై అభ్యంత‌రం తెలిపాడు. దాన్ని ఇప్పుడు కాలాకు ముడిపెడుతున్నారు. అందుకే ఈ రెండు దేశాల్లో సినిమాను బ్యాన్ చేసారు. ఇక ఇది చాల‌ద‌న్న‌ట్లు జ‌వ‌హార్ అనే వ్య‌క్తి కాలా త‌న తండ్రి తిరువ‌యిం నాడ‌ర్ జీవితం ఆధారంగా చేసారంటూ కోర్ట్ ను ఆశ్ర‌యించాడు. 100 కోట్లు ప‌రిహారం కావాలంటూ పిటిష‌న్ కూడా వేసాడు. 1957లో నాడ‌ర్ అనే వ్య‌క్తి త‌మిళ‌నాడు నుంచి ముంబైలోని ధారావికి వెళ్లాడు. అక్క‌డే ఉండి ప్ర‌జ‌ల క‌ష్టాలు తీర్చి.. వాళ్ల‌కు నాయ‌కుడు అయ్యాడు.
లోక‌ల్ లీడ‌ర్స్ బారి నుంచి త‌మిళ ప్ర‌జ‌ల‌ను కాపాడి వాళ్ల‌కు దేవుడు అయ్యాడు. అందుకే అత‌న్ని కింగ్ ఆఫ్ ధారావి అనేవాళ్లు. ఇప్పుడు ఇదే క‌థ‌ను కాలాలో తీసారంటున్నాడు నాడ‌ర్ కొడుకు జ‌వ‌హార్. త‌న‌కు 100 కోట్లు ఇస్తే కానీ సినిమా విడుద‌ల కానివ్వ‌నంటున్నాడు. మొత్తానికిప్పుడు ర‌జినీ రాజ‌కీయాల్లోకి రావడంతోనే కావాల‌నే కొంద‌రు కాలాను ఇలా ఇబ్బంది పెడుతున్నార‌నే వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి. గ‌తంలోనూ ర‌జినీ సినిమాల‌పై ఇలాంటి వార్త‌లు వినిపించినా కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది. మ‌రి చూడాలిక‌.. దీని నుంచి కాలా ఎలా బ‌య‌ట‌ప‌డ‌తాడో మ‌రి..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here