కాలా వస్తున్నాడు.. మరికొద్ది గంటల్లోనే కాలా వచ్చేస్తున్నాడు. రంజిత్ దర్శకత్వంలో కబాలి తర్వాత మరోసారి రజినీకాంత్ నటించిన కాలా చిత్రం విడుదల కాబోతుంది. ఒకటి రెండు కాదు.. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3500 స్క్రీన్స్ లో విడుదలకు సిద్ధమైంది కాలా. తెలుగులోనే ఈ చిత్రం కోసం దాదాపు 800 స్క్రీన్స్ ఇచ్చారు. పైగా ఇప్పుడు సినిమాలు కూడా ఏమీ లేకపోవడంతో రజినీకాంత్ మేనియా నడిచేలా కనిపిస్తుంది.
కబాలి రేంజ్ లో క్రేజ్ లేదు కానీ కచ్చితంగా కాలా కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేయడం ఖాయం. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం దుమ్ము దులిపేస్తుందనడంలో సందేహం లేదు. ఇక తమిళనాట అయితే కాలా మేనియా నడుస్తుందిప్పుడు. అక్కడ ఓపెనింగ్ రికార్డులేవీ మిగిలేలా కనిపించడం లేదు. మెర్సల్ తో విజయ్ సృష్టించిన అన్ని రికార్డులకు రజినీ చెక్ పెట్టడానికి రెడీ అయ్యాడు. దాంతో పాటు ఓవర్సీస్ లో కూడా ఏ సౌత్ ఇండియన్ సినిమాకు సాధ్యం కాని రీతిలో విడుదలవుతుంది కాలా.
ముఖ్యంగా లండన్ లో అయితే ఏకంగా 75 స్క్రీన్స్ లో వస్తుంది. బాహుబలికి కూడా ఇది సాధ్యం కాని రికార్డ్. ఒక్క కర్ణాటకలో మాత్రమే కాలా విడుదల కావడం లేదు. అక్కడ ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా ఈ చిత్రం విడుదలైతే శాంతి భద్రతల సమస్యలు వస్తాయంటున్నాడు. దాంతో కాలా కన్నడ విడుదలపై ఇంకా క్లారిటీ రాలేదు. కన్నడ ఫిల్మ్ ఛాంబర్ తో మాట్లాడినా.. కోర్ట్ కు వెళ్లినా.. ఇప్పటి వరకు పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు. మొత్తానికి కర్ణాటక మినహా అన్నిచోట్లా కాలా రప్ఫాడించడానికి రెడీగా ఉన్నాడు.