ఈ మధ్య హాలీవుడ్ సినిమాల ప్రభావం ఇండియన్ సినిమాపై ఎక్కువగా పడుతుంది. ఎక్కడ్నుంచో వచ్చి మన సినిమాలకు కూడా టెండర్ పెడుతు న్నాయి ఇవి. ఈ మధ్యే వచ్చిన అవేంజర్స్ దీనికి నిదర్శనం. ఇక ఇప్పుడు జురాసిక్ వరల్డ్ వచ్చింది. ది ఫాలెన్ కింగ్ డమ్ అంటూ ఇందులో ఐదో భాగం విడుదలైంది.
జేఏ బోయనా తెరకెక్కించిన ఈ చిత్రం జూన్ 7న ఇండియాలో విడుదలైంది. యుఎస్ కంటే రెండు వారాల ముందే ఇక్కడ రిలీజ్ చేసారు దర్శక నిర్మాతలు. దీన్నిబట్టే తెలుస్తుంది ఇండియన్ మార్కెట్ పై హాలీవుడ్ ఎంతగా కన్నేసిందో అని..! అయితే ఈ చిత్రానికి ఎందుకో కానీ ఊహించిన రెస్పాన్స్ రావడం లేదు. జురాసిక్ వరల్డ్ గత భాగం ది పార్క్ ఈజ్ ఓపెన్ దీనికంటే అద్భుతంగా ఉందంటున్నారు ప్రేక్షకులు.
పైగా అది 100 కోట్లకు పైగా ఇండియాలోనే వసూలు చేసింది. కానీ ఇప్పుడు ఈ చిత్రానికి అంత సినిమా లేదంటున్నారు. కథ కూడా మరీ పీలగా ఉండటంతో కొత్త జురాసిక్ వరల్డ్ నిలదొక్కుకోవడం కష్టమే అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి చూడాలిక.. ఈ టాక్ తో ఈ డైనోసర్స్ పోరాటం బాక్సాఫీస్ పై ఎంతవరకు ఉంటుందో..?