కొన్ని సినిమాలకు అద్భుతమైన టాక్ వస్తుంది కానీ ప్రమోషన్ సరిగ్గా లేక పోతుంటాయి. అలాంటివి ఎన్నో సినిమాలున్నాయి. ఇన్నాళ్లూ విశాల్ సినిమాలకు కూడా ఇదే ఉండేది. ఈయన నటించిన చాలా సినిమాలకు తెలుగులో మంచి టాక్ వచ్చేది కానీ ప్రమోషన్ లేక ఫ్లాప్ అయ్యాయి. కానీ ఇప్పుడు అభిమన్యుడుకు మాత్రం అలా కాకుండా చూసుకున్నాడు విశాల్. తొలిరోజు నుంచే ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దాంతో ప్రమోట్ కూడా అలాగే చేసుకున్నాడు ఈ హీరో. డిజిటల్ క్రైమ్ ను బేస్ చేసుకుని దర్శకుడు మిత్రన్ చేసిన ప్రయత్నం అద్భుతం.
ఈ చిత్రం చూసిన తర్వాత కనీసం ఒక్కసారైనా మళ్లీ మన స్మార్ట్ ఫోన్ ఇష్టమొచ్చినట్లు వాడాలంటే భయపడతాం. అంతగా నిజాలు చూపించాడు ఈ చిత్రంలో. కాన్ టెంపరరీ కథకు ప్రమోషన్ కూడా తోడు కావడంతో ఈ చిత్రం తొలి వారంలోనే ఏకంగా 12 కోట్ల గ్రాస్.. 7.6 కోట్ల షేర్ వసూలు చేసింది. ఓ డబ్బింగ్ సినిమాకు ఇది చాలా ఎక్కువ వసూళ్లు. పైగా ఈ చిత్రంలో విశాల్ తో పాటు సమంత, అర్జున్ కూడా ప్రాణం.వాళ్ల ఇమేజ్ కూడా సినిమాకు కలిసొచ్చింది. మొత్తానికి తెలుగులో హిట్ కొట్టాలన్న విశాల్ కల ఇప్పటికి తీరిందన్నమాట.