మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో కూడా వచ్చేసాడు. చిన్నల్లుడు కూడా ఎలా ఉంటాడో అర్థమైపోయింది. స్క్రీన్ ప్రజెన్స్ అయితే బాగానే ఉంది కానీ నటన ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం కొన్నాళ్లు ఆగాల్సిందే. చిరు చిన్నల్లుడు కళ్యాణ్ నటిస్తున్న విజేత టీజర్ విడుదలైంది.
రాకేష్ శశి తెరకె క్కిస్తున్న ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నాడు. మాళవిక నయ్యర్ హీరోయిన్. తండ్రి చాటు బిడ్డగా ఇందులో నటిస్తున్నాడు కళ్యాణ్ దేవ్. అన్నీ తండ్రే చూసుకోవాలి.. తాను మాత్రం ఖాళీగా ఉంటాను అనే పాత్ర ఇది. ఆ తర్వాత లైఫ్ లో అనుకోకుండా ఓ కష్టం వచ్చినపుడు ఆ కొడుకు ఎలా రియాక్ట్ అయ్యాడు అనేది విజేత కథ. టీజర్ లోనే దాదాపు కథ ఇలా ఉండబోతుందని చెప్పేసాడు దర్శకుడు రాకేష్.
ఇక కళ్యాణ్ కూడా చూడ్డానికి బాగున్నాడు. అతడి తండ్రిగా మురళీ శర్మ నటించాడు. టీజర్ లో ఎక్కడా మామయ్యను కానీ.. మెగాస్టార్ గుర్తులు కానీ ఎక్కడా అయితే కనిపించలేదు. మరి రేపు సినిమాలో కూడా ఏం లేకపోతే అల్లుడు సొంతంగా ఏదో చేస్తున్నాడని అర్థం. మొత్తానికి చూడాలిక.. జులైలో ఈ అల్లుడుగారి గిల్లుడు ఎలా ఉంటుందో తెలుస్తుంది.