ఇంక ఇప్పుడు ప్రియాంక చోప్రా ఇండియన్ అమ్మాయి కాదు. అక్కడి వాళ్లను పెళ్లి చేసుకుంటే అక్కడే వెళ్లిపోతుంది కదా.. ఇక ఇండియాకు ఎందుకు వస్తుంది..? సినిమాల కోసం అని హాలీవుడ్ కు వెళ్లి అక్కడే ఒకర్ని ప్రేమించి పెళ్లి కూడా చేసుకోడానికి రెడీ అవుతుంది ప్రియాంక చోప్రా. ఇది కాస్త విచిత్రంగా అనిపించినా ఇదే నిజం. ఇప్పుడు హాలీవుడ్ లో ప్రియాంక డేటింగ్ గురించే మాటలు వినిపిస్తున్నాయి బాగా.
అది కూడా తన కంటే 11 ఏళ్లు చిన్నవాడైన కుర్రాడితో ప్రేమలో పడింది ప్రియాంక. సింగర్ కమ్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నిక్ జోనస్ తో కొన్ని రోజులుగా ఆ గట్టునుంటావా.. ఈ గట్టుకొస్తావా అంటూ పాటలు పాడుకుంటూ మరి అన్ని గట్లు తిరిగేస్తున్నారు. ఏ పార్టీకి వెళ్లినా కూడా కలిసే వెళ్లి..
కలిసే వస్తున్నారు. తమ రిలేషన్ పై అడిగితే.. నిక్ ఏమీ 11 ఏళ్ల పిల్లాడు కాదుగా అంటూ హాట్ ఘాటు రిప్లై ఇచ్చింది ప్రియాంక. 2017 గాలా రెడ్ కార్పెట్ దగ్గరే ఈ ఇద్దరూ తొలిసారి కలిసారు.. అక్కడే జంటగా మెరిశారు. ఆ తర్వాత డేట్ కు వెళ్లారు. మనసులు కలిసాయి.. ఇప్పుడు పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నట్లు హాలీవుడ్ మీడియానే రాస్తుంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే ప్రియాంక నోరు విప్పాల్సిందే..!