హీరోయిన్స్ మాత్రమే కాదు.. అప్పుడప్పుడూ మిస్ ఇండియాలు.. మిస్ వరల్డ్ లు కూడా ప్రేక్షకులకు బాగానే తెలుస్తుంటాయి. ఆ బ్యాచ్ లోకి వచ్చే పేరు మానుషి చిల్లర్. హీరోయిన్లకు ఉన్నంత పాపులారిటి ఉందో లేదో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం అదిరిపోయే పాపులారిటీ ఉంది. ప్రస్తుతం ఈ భామ తన అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తుంది. పైగా మిస్ వరల్డ్ కదా.. అందరి చూపులు కూడా ఈ భామపైనే ఉన్నాయి. ఒకటి రెండు కాదు.. 15 ఏళ్ల తర్వాత ఇండియాకు మిస్ వరల్డ్ టైటిల్ తీసుకొచ్చిన ముద్దుగుమ్మ మానుషి చిల్లర్.
గతేడాది మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడిప్పుడే సినిమాల వైపు అడుగేస్తున్న ఈ భామ.. మధ్యమధ్యలో హాట్ ఫోటోషూట్ లతో మతులు పోగొడుతుంది. మొన్నీమధ్యే సముద్రపు అలల మధ్య అమ్మాయిగారి సొగసులు చూసి అబ్బో అనుకోక తప్పదు. ఎలాంటి మగాడు అయినా మానుషి ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ కు పడిపోవాల్సిందే. ఇంకో ఆప్షన్ కూడా లేదక్కడ. నీలి సముద్రం మధ్యలో బికినీ సోకులతో నీటినే వేడి ఎక్కించేస్తుంది ఈ ముద్దుగుమ్మ.
ఎంతైనా మిస్ వరల్డ్ కిరీటం అందుకున్న భామ కదా.. ఇక అందాల ఆరబోతలో ఏం హద్దులుంటాయి చెప్పండి..? అడిగిందే ఆలస్యం ఎంత వరకైనా సిద్ధం అంటారు వాళ్లు. ఇప్పుడు మానుషి కూడా ఇదే చేస్తుంది. ఇప్పటికే చాలా మ్యాగజైన్ కవర్ పేజీలపై సోకులు ఆరబోసిన మానుషి.. ఇప్పుడు మరోసారి హాట్ 0షోతో రెచ్చిపోయింది. ఇప్పటికే ఈ హర్యానా బ్యూటీకి బాలీవుడ్ నుంచి అవకాశాలు క్యూ కడుతున్నాయి. మరి వీటిలో దేనికి ఈ భామ ఒప్పుకుంటుందో చూడాలిక..!