అనుకున్నట్లుగానే జరిగింది. అలా నిశ్చితార్థం అయిందో లేదో.. ఇలా తన మనసులో మాటల్ని బయట పెట్టింది రేణుదేశాయ్. కొన్ని రోజులుగా ట్విట్టర్లో బాగా యాక్టివ్ గా ఉన్న రేణు.. ఇప్పుడు ఏకంగా ట్విట్టర్ నుంచే బయటికి వచ్చేసింది. తనకు కాబోయే వాడి ముచ్చట్లేం చెప్పలేదు ఈమె. పవన్ కళ్యాణ్ నుంచి విషెస్ అందుకున్న తర్వాత ట్విట్టర్ నుంచి రేణు బయటికి రావడం విశేషం.
ఇన్నాళ్లూ తనకు తోడుగా ఉన్న వాళ్లందరికీ ధన్యవాదాలు తెలిపింది రేణుదేశాయ్. ట్విట్టర్ నిండా నెగెటివిటీ ఉంది. ఇక్కడ ఉండే అజ్ఞాతవ్యక్తులు సినిమా గురించైనా.. ఒక రాజకీయ నాయకుడి గురించైనా నెగెటివ్ గానే మాట్లాడటానికే ఇష్టపడతారు. అందుకే ఈ నెగెటివిటీకి దూరంగా ఉండటానికి ట్విట్టర్ నుండి వెళ్లిపోవాలనుకుంటున్నాను.
నాకు అన్ని విషయాల్లో తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు అని చిన్న వివరణ ఇచ్చి తన ట్విట్టర్ అకౌంట్ ను డీ యాక్టివేట్ చేసింది రేణుదేశాయ్. ఈమె తీసుకున్న నిర్ణయాన్ని కొందరు స్వాగతిస్తుంటే.. మరికొందరు విమర్శిస్తున్నారు. సమాధానం చెప్పలేక పారిపోతున్నారా అంటూ కొందరు రేణును ప్రశ్నిస్తున్నారు కూడా. మరి దీనికి ఎలా రేణు సమాధానం ఇస్తారో చూడాలిక..!