లావా అంటే ఇక్కడ వాల్కెనో కాదు.. లావు.. బరువు పెరగడం అన్నమాట. ఇప్పుడు రెజీనాను చూస్తుంటే ఇదే చెప్పాలనిపిస్తుంది. ఇన్నాళ్లూ బరువు బాగా పెరిగినా కూడా ఎప్పుడూ ఎబ్బెట్టుగా మాత్రం అనిపించలేదు. కానీ ఇప్పుడు అనిపిస్తుంది. తమిళనాటే ఉండాలని ఫిక్స్ అయిపోయినట్లుంది అందుకే అరవోళ్ల సౌకర్యార్థం బరువు పెరిగిపోయింది రెజీనా. ఇప్పుడు ఈ భామను చూస్తుంటే వామ్మో ఏంటీ వెయిట్ అనిపించక మానదు.
ఈ మధ్యే మిస్టర్ చంద్రమౌళి ప్రమోషన్ కు వచ్చిన రెజీనాను చూసి అంతా షాక్ అయ్యారు. ఇక తెలుగుకు రావాలనే ఆశ కూడా పూర్తిగా చచ్చిపోయినట్లుంది.. అందుకే ఇలా బరువు పెరిగిపోయిందంటూ రెజీనాపై సెటైర్లు కూడా పేలుతున్నాయి. అయినా ఈ భామకు అదృష్టం లేదు కానీ ఈ పాటికే నెంబర్ వన్ హీరోయిన్ అయిపోవాల్సి ఉండేది.
ఎందుకో తెలియదు కానీ మొదట్నుంచీ రెజీనాపై పెద్ద హీరోలు చిన్న చూపు చూస్తూనే ఉన్నారు. లేకపోతే మరేంటి ఆమె కంటే తర్వాత వచ్చిన వాళ్లు కూడా స్టార్స్ అయిపోయారు కానీ రెజీనా ఇప్పటికీ అలాగే ఉంది. అంతెందుకు ఆమె ప్రాణ స్నేహితురాలు రకుల్ నెంబర్ వన్ కూడా అయింది. కానీ రెజీనా కెరీర్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. ఈ రోజుకు కూడా స్టార్ అవ్వాలని ఆరాటపడుతూనే ఉంది కానీ కాలేదు.. కావట్లేదు.. అవుతుందో లేదో క్లారిటీ లేదు.
అందం ఉంది.. అభినయం ఉంది కానీ అదృష్టమే లేక అక్కడే ఆగిపోయింది రెజీనా. పోనీ గ్లామర్ షో ఏమైనా తక్కువగా చేస్తుందా అంటే అదీ లేదు. మిస్టర్ చంద్రమౌళి అనే తమిళ సినిమా కోసం అమ్మడు రెచ్చిపోయిన తీరు అద్భుతమే. బీచ్ లో అమ్మాయిగారు బికిని వేసుకుని చేసిన రచ్చ ఓ రేంజ్ లో ఉంది. మునిగిపోతున్న కెరీర్ నావను ఒడ్డుకు చేర్చుకోడానికి అవసరమైన ప్రతీ ఆయుధాన్ని వాడేస్తోంది ఈ ముద్దుగుమ్మ. మరి ఈ వెయిట్ తో కెరీర్ వెయిట్ ఎలా మోస్తుందో చూడాలిక..!