ఈ కానీ ఏంటి అనుకుంటున్నారా..? ఎంత మంచి సినిమా చేసినా కూడా అందులో కచ్చితంగా ఏదో ఓ లోపం అయితే ఉంటుంది. అలాగే ఇప్పుడు సంజూలో కూడా కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా అద్భుతమే.. రాజ్ కుమార్ హిరాణీ నుంచి వచ్చిన ఐదో అద్భుతం ఇది. దీనికి ముందు కూడా ఆయన చేసిన నాలుగు సినిమాలు రికార్డులు తిరగరాసాయి. ఇక ఇప్పుడు ఐదోసారి కూడా ఇదే చేస్తున్నాడు.
సంజూ కూడా తొలి రోజే 40 కోట్లకు పైగా వసూలు చేసింది. చూస్తుంటే మూడు రోజుల్లో 120 కోట్లకు పైగా వసూలు చేసేలా కనిపిస్తుంది. ఇవన్నీ ఇలా ఉంటే సినిమాలో కావాలనే సంజయ్ దత్ ను చాలా అమాయకుడిగా.. మంచివాడిగా చూపించాడనే విమర్శలు వస్తున్నాయి. ఆయన అక్రమ ఆయుధాల కేస్ లో పట్టుబడి.. జైల్లోనే కొన్నేళ్ల పాటు ఉన్నాడు.
కచ్చితంగా ఆయన తప్పు చేసాడు.. అది నిరూపించబడింది కూడా. అయితే సంజయ్ దత్ కు ఏమీ తెలియదు.. కేవలం తన ఆత్మరక్షణ కోసం దాచుకున్న ఆయుధాలను అక్రమంగా దాచుకున్నాడని చూపించి కావాలనే టెర్రరిస్ట్ ముద్ర వేసారని చూపించారు సినిమాలో. అవన్నీ సంజయ్ దత్ కు తెలియకుండా ఎలా జరుగుతాయి..? అప్పటికి ఆయనేం చిన్న పిల్లాడు కాదు కదా.. అన్నీ తెలిసి చేసిన తర్వాత కూడా ఎందుకు సంజూను మంచి వాడిగా చూపించే ప్రయత్నం చేసారనేది అందరి నుంచి వస్తున్న ప్రశ్న.
బయోపిక్ సంజూది కాబట్టి ఆయన మంచితనం ప్రూవ్ చేయడానికి ప్రాణ స్నేహితుడైనా రాజ్ కుమార్ హిరాణి ప్రయత్నించాడనేది అసలు ఆరోపణ. అయితే సినిమాలో ఎమోషన్ అద్భుతంగా వర్కవుట్ అయింది.. నిజంగానే సంజయ్ దత్ అమాయకుడు అంతా కలిసి ఆయన్ని ఇరికించేసారు అనే విధంగా థియేటర్ నుంచి బయటికి వస్తారు ప్రేక్షకులు. మరి ఇందులో నిజాలేంటో కేవలం సంజయ్ దత్ కు మాత్రమే తెలుసు. బయోపిక్ లో కూడా అన్నీ అబద్ధాలే చూపిస్తే దానికి ఎవరూ ఏం చేయలేరు.. ఒకవేళ అదే నిజం అయితే మాత్రం నిజంగానే సంజయ్ జీవితం నాశనం అయిపోయిందని బాధపడాల్సిందే.