ఈ సామెత ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా..? ఇప్పుడు గోపీచంద్ పంతం సినిమా చూసిన తర్వాత అందరికీ అనిపించింది ఇదే. 25వ సినిమా కదా అందుకే కాస్త శ్రద్ధ పెట్టి మరీ సోషల్ మెసేజ్ ఉన్న కథ చేసాడు ఈ హీరో. కొత్త దర్శకుడే అయినా కూడా చక్రవర్తి దీన్ని బాగానే హ్యాండిల్ చేసాడు. అయితే కథ మరీ రొటీన్ కావడమే ఇక్కడ అసలు చిక్కుల్ని తీసుకొచ్చింది. గోపీచంద్ తన పాత్ర వరకు చంపేసాడు..
ఈ పాత్ర కోసమే పుట్టాడా అనేంతగా ఇందులో ఒదిగిపోయాడు. కానీ కథ సహకరించకపోతే పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు..? ఇప్పుడు పంతం విషయంలో ఇదే జరుగుతుంది. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది కానీ గోపీ నటనకు మాత్రం నూటికి నూరు మార్కులు పడుతున్నాయి. ఠాగూర్.. శ్రీమంతుడు సినిమాలను కలిపి మిక్సీలో వేసి కొడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది పంతం.
అయితే ఆ సినిమాల్లో ఉన్నంత మ్యాటర్ ఇందులో కనిపించదు. మంచి నేపథ్యం తీసుకున్నా కూడా కాస్త అనుభవం ఉన్న దర్శకుడు అయ్యుంటే పంతం సినిమాను ఇంకా బాగా హ్యాండిల్ చేసేవాడు. గోపీచంద్ గత సినిమాలతో పోలిస్తే పంతం కచ్చితంగా బెటర్ మూవీనే.. కానీ కమర్షియల్ గా ఇది కూడా గోపీ హిట్ కొట్టాలన్న పంతాన్ని మాత్రం నెరవేర్చడం కష్టంగానే కనిపిస్తుంది. తేజ్ ఐ లవ్ యూ ఫలితాన్ని బట్టి పంతం గెలుస్తుందా.. ఓడుతుందా అనేది తెలుస్తుంది.