చిన‌బాబు.. ల‌క్ష్యం చాలా పెద్ద బాబూ..!


మ‌న ద‌గ్గ‌రే ఏడాదికి క‌నీసం ఒక్క‌టైనా ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ వ‌స్తుంది. అందులో ఎమోష‌న్స్ ను మిక్సీలో వేసి ఫుల్లుగా రంగ‌రించి కుటుంబ క‌థ‌ల‌కు ప్రాణం పోస్తుంటారు మ‌న ద‌ర్శ‌కులు. ఇప్పుడు మ‌న సినిమాలు స‌రిపోవ‌న్న‌ట్లు ప‌క్క రాష్ట్రం నుంచి ఇవే బంధాల‌తో వ‌చ్చాడు చిన‌బాబు. కార్తి హీరోగా వ‌చ్చిన ఈ చిత్రం ఇప్పుడు బాగానే ర‌న్ అవుతుంది. త‌మిళ్ లో ఈ సినిమా మ‌రో అనుమానం లేకుండా బ్లాక్ బ‌స్ట‌రే.
కానీ తెలుగులో ఇంత ఓవ‌ర్ డోస్ ప‌ని చేస్తుందా అనేది ఆస‌క్తిక‌ర‌మే. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు అయితే క‌లెక్ష‌న్లు బాగానే ఉన్నాయి. కానీ చిన‌బాబు సేఫ్ కావాలంటే 6.5 కోట్లు షేర్ రావాలి. ఆర్ఎక్స్ 100 చిన్న సినిమాగా మొద‌లై వ‌సూళ్లు కుమ్మేస్తుంది. దీని జోరు చూస్తుంటే మ‌రో రెండు మూడు రోజులు ఏ సినిమాకు వ‌సూళ్లు కూడా వ‌చ్చే అవ‌కాశం క‌నిపించ‌ట్లేదు. ఇప్ప‌టికే విజేత ప‌రాజ‌యం పాల‌య్యాడు. ఈ టైమ్లో చిన‌బాబు ఎంత‌వ‌ర‌కు నిల‌బ‌డ‌తాడో చూడాలి. పాండిరాజ్ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని సూర్య నిర్మించాడు.
90ల్లో చూసే ముద్దుల మావ‌య్య క‌థ‌తో పాటు 80ల్లో వ‌చ్చిన అక్కా త‌మ్ముడు సెంటిమెంట్ కూడా చూపించాడు. కొన్నిచోట్ల ఓవ‌ర్ అనిపించినా చిన‌బాబు మాత్రం మ్యాగ్జిమ‌మ్ మేనేజ్ చేసాడు. పాండిరాజ్ స్క్రీన్ ప్లేతో సినిమా గ‌ట్టెక్కింది. కామెడీ కూడా అద్భుతంగా ఉండ‌టంతో తెలుగులో వ‌ర్క‌వుట్ అయ్యే ఛాన్సులు తీసి పారేయ‌లేం. అయితే ఏం జ‌ర‌గాలన్నా ముందు కుటుంబ ప్రేక్ష‌కులు ఈ చిత్రానికి క‌నెక్ట్ అవ్వాలి. లేదంటే కార్తికి నిరాశ త‌ప్ప‌దు. చూడాలిక‌.. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఈయ‌న కోసం థియేట‌ర్స్ కు వ‌చ్చి అర‌వ సెంటిమెంట్ ను మ‌నోళ్లు ఎంత‌వర‌కు ఆక‌లింపు చేసుకుంటారో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here