తెలిసో తెలియకో ఒక్కసారి మహానటి పాత్రలో నటించేసింది కీర్తిసురేష్. ముందు ఈ పాత్రలో నటించడానికి చాలా భయపడింది కీర్తి. అసలు తానేంటి మహానటి సావిత్రి పాత్రలో నటించడం ఏంటి..? తన వల్ల కాదు అని వెనకడుగు వేసింది. కానీ ఎలాగోలా మహానటి పాత్రలో నటించడానికి ఒప్పుకుని.. చేసింది ఇప్పుడు దాని ఫలితం మోస్తుంది కీర్తి.
ఈ చిత్రం చూసిన తర్వాత ఈమె తప్ప ఇప్పుడు ఎవరూ సావిత్రి పాత్రలో నటించలేరని ఫిక్సైపోయారు ప్రేక్షకులు. చూస్తే సావిత్రి పాత్రలో కీర్తిని మాత్రమే చూడాలి.. లేదంటే లేదు. ఇప్పుడిదే అంతా ఫిక్సైపోయింది. అందుకే ఎన్టీఆర్ బయోపిక్ లో కూడా ఇప్పుడు సావిత్రి పాత్ర కోసం మరోసారి కీర్తిసురేష్ నే ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
క్రిష్ కూడా ఈ విషయంలో ముందున్నాడు. ఎలాగైనా కీర్తిని ఒప్పించి ఎన్టీఆర్ బయోపిక్ లో నటింపజేయాలని ఆలోచిస్తున్నాడు. దీనికి ముందు కీర్తిసురేష్ నో చెప్పినా.. ఓ టైమ్ లో బాలయ్యే రంగంలోకి దిగేసరికి కీర్తి కూడా మరేం మాట్లాడలేదని తెలుస్తుంది. ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తినే మరోసారి కనిపించడం ఖాయం అయిపోయింది. అంతేకాదు.. ఇదే సినిమాలో రకుల్ కూడా ఓ ముఖ్య పాత్రలో నటించబోతుంది. అయితే అది ఎవరి పాత్ర అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ నిండా స్టార్స్ నిండిపోయారు. ఇంతమందిని క్రిష్ ఒకే సినిమాలో ఎలా బ్యాలెన్స్ చేస్తాడో చూడాలి..!