కృతికర్భందా.. పట్టువదలని విక్రమార్కిని. తెలుగులో పవన్, రామ్ చరణ్ లాంటి స్టార్స్ తో నటించినా లక్ కలిసిరాలేదు. అలాగని ఖాళీగా ఉండకుండా కన్నడలో స్టార్ అయిపోయింది. మళ్లీ ఇప్పుడు బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటుంది. ఓటమి ఒప్పుకోకని ఎవరో మహానుభావుడు చెప్పినట్లుగా ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ దూరిపోతుంది కృతి. ఇప్పుడు కృతి ముందున్న ఏకైక లక్ష్యం అందాల ఆరబోత.
గ్లామర్ షో లో ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదు కృతికర్బందా. హీరోయిన్ గా వెలిగిపోదామనే ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఈ బ్యూటీ. ఇప్పటికీ హాట్ ఫోటోషూట్లతో రప్ఫాడిస్తుంది కృతి. ఆ మధ్య రాజ్ 4లో ఇమ్రాన్ హష్మీ, గౌరవ్ అరోరాలతో రొమాన్స్ చేసింది.
ఈ సినిమాలో అయితే ఏకంగా హాట్ సీన్స్, లిప్ లాక్స్ తో రెచ్చిపోయింది. అయినా అదృష్టం మాత్రం కలిసి రాలేదు. రాజ్ 4 ఫ్లాప్ తో కృతి జాతకం మారలేదు. అయినా పట్టువదలని విక్రమార్కిణిలా మారిపోయింది కృతికర్భందా.
ఈ మధ్యే రాజ్ కుమార్ రావ్ తో కలిసి నటించిన షాదీ మే జరూర్ ఆనా సినిమాలోనూ ముద్దులతో ముంచెత్తింది. మొన్నటికి మొన్న వీరి కి వెడ్డింగ్ లోనూ గ్లామర్ షోతో చంపేసింది కృతి. ఏ ఈవెంట్ కు వచ్చినా ఉల్లిపొర కంటే పలుచగా ఉండే దుస్తుల్లో కనిపిస్తుంది. ఇప్పుడు కూడా క్లీవేజ్ షోతో అన్నీ కప్పుకున్నట్లే ఉన్నా.. బయటికి మాత్రం అందాలను ఆరేసింది. ఈ అందాలతో ఎప్పటికప్పుడు ఊపిరి ఆపేస్తూనే ఉంది కృతి.