అంతే.. ఇండస్ట్రీలో అంతే.. జాతకం తిరగబడానికి.. నిలబడటానికి ఒక్క సినిమా చాలు. అను ఎమ్మాన్యువల్ నే తీసుకోండి. మొన్నటి వరకు ఈ భామ పేరు మారుమోగిపోయింది. కానీ ఏం చేస్తాం.. ఆశలు పెట్టుకున్న ఆక్సీజన్ కొంప ముంచేసింది. నిలబెడతాడు అనుకున్న అజ్ఞాతవాసి తన కెరీర్ నే అజ్ఞాతంలోకి నెట్టేసాడు. ఇక నా పేరు సూర్య కూడా అనును నిండా ముంచేసింది. పవర్ స్టారే కాపాడలేనపుడు స్టైలిష్ స్టార్ ఎంత..? ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు ఫోటోషూట్లలో రెచ్చిపోతుంది ఈ కేరళకుట్టి.
పైగా సినిమాల్లోనూ అమ్మాయి గారు ఫుల్ గా రెచ్చిపోతారు. అందాల ఆరబోతకు ఎలాంటి అడ్డంకులు లేకపోవడంతో అను ఎమ్మాన్యువల్ కు ఫ్లాపులు ఉన్నా కూడా నువ్వే అరకొర అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం నాగచైతన్యతో మారుతి తెరకెక్కిస్తోన్న శైలజారెడ్డి అల్లుడులో నటిస్తుంది ఈ భామ. ఇందులో ఇగో ఎక్కువగా ఉన్న పాత్రలో నటిస్తుంది అను. ఈ చిత్రంలో అనుకు అవకాశం రావడానికి కారణం త్రివిక్రమ్ అని తెలుస్తుంది.
అజ్ఞాతవాసి టైమ్ లోనే అను వర్క్ మెచ్చిన మాటల మాంత్రికుడు.. మారుతి సినిమాలో రిఫర్ చేసాడు. ఈ చిత్ర నిర్మాత రాధాకృష్ణ కావడంతో పని సులువైపోయింది. ఆగస్ట్ 31న విడుదల కానుంది సినిమా. ఇది కానీ తేడా కొడితే పూర్తిగా అను ఎమ్మాన్యువల్ కు తెలుగుతో రుణం తీరిపోయినట్లే..!