ఇప్పుడు ప్రేక్షకులతో పాటు మారుతిని అభిమానించే వాళ్లు కూడా ఇదే అడుగుతున్నారు. ఈయనకంటూ ఇండస్ట్రీలో ఓ బ్రాండ్ ఉంది. మారుతి సినిమా అంటే కామెడీ కచ్చితంగా ఉంటుందనే నమ్మకం ఉంది. కానీ ఇప్పుడు దీన్ని చేతులారా ఈయనే నాశనం చేసుకుంటున్నాడు. డబ్బులకు ఆశ పడుతున్నాడో లేదంటే మరేదైనా కారణంతోనో తెలియదు కానీ ఊరు పేరు తెలియని సినిమాలకు కథలు అందించి తన బ్రాండ్ తానే చెడగొట్టు కుంటున్నాడు. ఇప్పుడు బ్రాండ్ బాబు పరిస్థితి ఇదే. ఈ సినిమాకు కనీసం పోస్టర్ ఖర్చులు అయినా వచ్చే అవకాశం కనిపించడం లేదు. మూడు రోజుల్లో కనీసం 50 లక్షల షేర్ తీసుకురాలేదు ఈ సినిమా.
మరోవైపు బడ్జెట్ చూస్తే దాదాపు 8 కోట్లకు పైగానే పెట్టినట్లు తెలుస్తుంది. మారుతి బ్రాండ్ చెప్పి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కానీ పూర్తిగా మిస్ ఫైర్ కావడమే కాదు.. ఎందుకు ఇలాంటి సినిమాలకు మారుతి కథలు అందిస్తున్నాడు అంటూ రివర్స్ లో ఆయనపైనే సెటైర్లు పడుతున్నాయి. ఓవర్సీస్ లో ఈ సినిమా చూడ్డానికి ఒక్క ప్రేక్షకుడు మాత్రమే థియేటర్ కు వచ్చాడు. అక్కడ కేవలం 10 డాలర్లు మాత్రమే వసూలు చేసింది ఈ చిత్రం. ఇప్పటికైనా తన బ్రాండ్ వ్యాల్యూ తెలుసుకుని మారుతి ఇలాంటి కథలు రాయకుండా ఉంటే మంచిదంటున్నారు ఆయన్ని అభిమానించే వాళ్లు. మరి దీన్ని మారుతి సీరియస్ గా తీసుకుంటాడో లేదో..?