కీర్తి సురేష్ తో విజయ్ తీన్మార్.

బై వన్ గెట్ వన్ ఆఫర్ గురించి వినే ఉంటారు. విజయ్ తో ఇది ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. ఏదో ఒక సినిమాలో నటిస్తే చాలు వరుసగా అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. హీరోయిన్లను రిపీట్ చేయడం లో విజయ్ ఆరితేరిపోయాడు. ఇప్పటికే సమంత, కాజల్ లాంటి హీరోయిన్ లతో వరస సినిమాలు చేశాడు విజయ్.

ఇప్పుడు కీర్తి సురేష్ కు ఆఫర్స్ ఇస్తున్నాడు. ఇప్పటికే ఈమెతో భైరవ, సర్కార్ సినిమాల్లో నటించాడు విజయ్. ఇప్పుడు అట్లీ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలో కూడా కీర్తి సురేష్ ని హీరోయిన్ గా తీసుకుంటున్నారు. ఇందులో ఇప్పటికే నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. రెండో హీరోయిన్ కీర్తి సురేష్ ను ఎంపిక చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఒలంపిక్స్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు అట్లీ కుమార్.

సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని 100 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇందులో 16 మంది అమ్మాయిలను సెలెక్ట్ చేసుకున్నాడు అట్లీ కుమార్. విజయ్ ఫుట్ బాల్ కోచ్ గా నటిస్తున్నాడు. ఒలంపిక్స్ విషయంలో జరుగుతున్న అన్యాయాలను బయటపెట్టే కథ ఇది. ఈ చిత్ర కథ కోసం చాలామంది క్రీడా నిపుణుల దగ్గర కూర్చొని ముఖ్యమైన పాయింట్ తీసుకున్నాడు దర్శకుడు అట్లీ కుమార్. మొత్తానికి మూడోసారి విజయ్, కీర్తి సురేష్ ఈ సినిమాలో జోడి కట్టబోతున్నారు. ఎలా ఉండబోతుందో చూడాలి మరి.

vijay keerthy suresh

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here