ఎఫ్ 2 16 రోజుల కలెక్షన్లు.. లాభాలు వింటే గుండె ఆగుతుంది..

ఈ రోజుల్లో ఒక పెద్ద సినిమా కొంటే పెట్టిన డబ్బులు వెనక్కి వస్తే చాలు అనుకుంటున్నారు నిర్మాతలు. ఇక డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఎక్కువగా లాభాలు రావడం కూడా చాలా అరుదు. వాళ్లు కూడా అంతే ఒక రూపాయి పెట్టుబడి పెడితే రూపాయి పైన ఒక పదిపైసలో ఇరవై పైసలో వస్తే చాలు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఒక సినిమా మాత్రం పెట్టిన బడ్జెట్ కు అమ్మిన రేట్ల కంటే రెండింతలు లాభాలు తీసుకొస్తుంది.సంక్రాంతికి విడుదలైన ఎఫ్2 సినిమా 16 రోజుల తర్వాత 72 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ సినిమాను అమ్మింది కేవలం 35 కోట్లకు మాత్రమే.. అంటే ఇప్పటికే డబుల్ తీసుకొచ్చింది వెంకీ వరుణ్ సినిమా.

F2 achieves a Milestone
F2 achieves a Milestone

నైజాంలో అయితే 9 కోట్లకు ఈ సినిమాను అమ్మితే ఏకంగా 20 కోట్లు తీసుకొచ్చింది.. ఇక ఆంధ్రాలో 14 కోట్ల బిజినెస్ చేస్తే ఇప్పటికే 28 కోట్లు తీసుకొచ్చింది.. ఓవర్సీస్లో కూడా మూడు కోట్లకు ఎఫ్ 2 సినిమా అమ్మితే ఇప్పుడు ఏకంగా 8 కోట్లకు పైగా తీసుకొచ్చింది. ఇంకా వస్తూనే ఉన్నాయి కలెక్షన్లు. ఎక్కడ చూసినా కూడా ఇప్పటికీ హౌస్ ఫుల్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. దాంతో ఈ సినిమా 80 కోట్లకు పైగా వసూలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికీ వసూళ్లు తగ్గకపోవడం.. మరో రెండు వారాలు సినిమాలు ఏమీ లేక పోవడంతో ఈ సినిమా పంట పండటం ఖాయం. వీళ్ళ దూకుడు చూస్తుంటే 150 కోట్ల గ్రాస్ వసూలు చేయడం ఈజీ అనిపిస్తుంది. మొత్తానికి పండగ వాతావరణం మొత్తం దిల్ రాజు ఆఫీస్ లోనే కనిపిస్తుంది ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here