“జువ్వ” ఆడియో విడుదల వేడుక !!

సోమి ఫిలిమ్స్ పతాకంపై రంజిత్, పాలక్ లల్వాని జంటగా భరత్ సోమి నిర్మించిన చిత్రం జువ్వ. ఈ చిత్రం యొక్క ఆడియో రిలీజ్ వేడుకలు ఆదివారం హైదరాబాదు లో ఘనంగా జరిగాయి. బొత్స సత్యనారాయణ , ఆయన సతీమణి బొత్స ఝాన్సీ విశిష్ట అతిథులుగా హాజరైన ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, అడివి శేష్, హాస్య నటులు ఆలీ ,సప్తగిరి,భద్రం,చిత్ర దర్శకుడు త్రికోటి, మాటల రచయిత  రత్నం, మలయాళ నటుడు అర్జునా తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన  సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ఆడియో సి.డి. ని విడుదల చేసారు.
ఈ సందర్భంగా  సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి మాట్లాడుతూ  ” దర్శకుడు త్రికోటి నాకు చాలా సంవత్సరాలుగా తెలిసిన వ్యక్తి. అతని మొదటి సినిమా దిక్కులు చూడకు రామయ్య చిత్రానికి కూడా నేనే సంగీతం అందించాను.ఇది పక్కా కమర్షియల్ సినిమా.  ప్రేక్షకులకు ఒక విందు భోజనం లాంటిది. సినిమా నేను చూసాను. అన్నీ రకాల ఎమోషన్స్ ఉన్నాయి. హీరో రంజిత్ డాన్స్,  ఫైట్స్,  చాలా బాగా చేసాడు. హీరో గా అతను ఈ సినిమా ద్వారా తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు.  కమర్షియల్  సినిమాలతో పాటు ఆఫ్ బీట్ సినిమాలు కూడా చేసి  భవిష్యత్తులో పెద్ద స్టార్ గా ఎదగాలని కోరుకుంటున్నాను. మెగాస్టార్ చిరంజీవి గారు టీజర్ విడుదల చేసారు. ఇప్పుడు సెన్సేషనల్ డైరెక్టర్ వినాయక్ ఆడియో విడుదల చేస్తున్నారు. సినిమా హిట్ అయ్యి అందరికి మంచి పేరు రావాలి.” అన్నారు.
మాటల రచయిత ఎం.రత్నం మాట్లాడుతూ “త్రికోటికి నాకు పాతిక సంవత్సరాల స్నేహం ఉంది. చాలా తెలివైన దర్శకుడు. కథ కు సంబందించిన ట్రీట్మెంట్ విషయం లో చాలా ఖచ్చితంగా ఉంటాడు.సీన్ నచ్చేదాకా తనకు కావలసిన విధంగా రాసివ్వాలి. ఈ  సినిమా అతనికి మంచి దర్శకుడిగా గుర్తింపు ఇస్తుంది. అలాగే నిర్మాత భరత్ లో ప్రొడ్యూసర్ తో పాటు ఒక రచయిత కూడా ఉన్నాడు. ఇక హీరో రంజిత్ ను చూస్తే  చాలా అనుభవం ఉన్న నటుడిగా చేసాడు. ఈ సినిమా తర్వాత హీరో డేట్స్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది అని ఖచ్చితంగా చెప్పగలను.హీరొయిన్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. పాటలు బాగున్నాయి.కీరవాణి గారి అబ్బాయి భైరవ పాడిన ఓ కలా అనే పాట నాకు చాలా నచ్చింది. దర్శకుడు త్రికోటి కి మంచి హిట్ సినిమా అవుతుంది “అని అన్నారు.
నటుడు ఆలీ మాట్లాడుతూ ” సాదారణంగా కేరళ నుంచి తెలుగు ఇండస్ట్రీ కి హీరొయిన్ లు వచ్చేవారు. కానీ మొదటిసారిగా అర్జునా అనే విలన్ ని పరిచయం చేస్తున్నారు ఈ సినిమా ద్వారా. పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి .బాహుబలి తర్వాత కీరవాణి చేస్తున్న సినిమా ఇది.  20 సంవత్సరాలుగా ఇండస్ట్రీ లో ఉన్న దర్శకుడు త్రికోటి మంచితనం చూసి కీరవాణి గారు ఒప్పుకున్నారు.అతనికి ఖచ్చితంగా ఒక హిట్ సినిమా అవుతుంది.అలాగే హీరో రంజిత్ వెరీ టాలెంటడ్ ఆర్టిస్ట్. ఎక్కడా కంగారు పడకుండా సేనియర్ లతో పోటీ పడి నటించాడు. మంచి భవిష్యత్తు ఉంది. టీం అందరికి మంచి పేరు రావాలి” అన్నారు.
సప్తగిరి మాట్లాడుతూ ” కీరవాణి గారికి నేను పెద్ద అభిమానిని. కేవలం పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం బాహుబలి సినిమాను 7 సార్లు చూసాను. అలాగే  ఈ జువ్వ సినిమాలో డిఫరెంట్ గెటప్ లతో మిమ్మల్ని నవ్వించే ప్రయత్నం చేసాను. సినిమా చాలా బాగుంది. హీరో కష్టపడి సినిమా చేసాడు. అతని శ్రమకు ఫలితం స్క్రీన్ మీద కనిపిస్తుంది. హీరోకు ఫ్యామిలీ సపోర్ట్ ఉండటం చాలా అదృష్టం. నాక్కూడా ఇలాంటి అన్నయ్య ఉంటె బాగుండు అనిపిస్తుంది. సినిమా మంచి సక్సెస్ కావాలి అని కోరుకుంటున్నాను.” అన్నారు.
సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ ” మా కుటుంబానికి ఆప్త మిత్రుడు బొత్స సత్యనారాయణ వారి సతీమణి బొత్స ఝాన్సీ గారు మరియు వారి అల్లుడు ఈ సినిమా నిర్మాత భరత్ సోమి గారికి శుభాకాంక్షలు. తమ్ముడి మీద అభిమానంతో హీరో గా పరిచయం చేస్తున్న భరత్ కు అభినందనలు. ఈ సినిమా ద్వారా  రంజిత్ కు మంచి నటుడుగా గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను. అలాగే కీరవాణి గారు ఈ సినిమా కు సంగీతం అందిచడం చాలా గొప్ప విషయం. సినిమా ఖచ్చితంగా బాగుంటుంది అనుకుంటేనే  సంగీతం అందిస్తారు. కాబట్టి ఈ సినిమా మంచి విజయం సాధించాలి” అన్నారు.
దర్శకుడు త్రికోటి మాట్లాడుతూ: నాకు దర్శకుడిగా మొదటి అవకాశం ఇచ్చిన నిర్మాతలు సాయి కొర్ర్రపాటి గారికి, రాజమౌళి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఈ సినిమా అవకాశం కల్పించిన మహేంద్ర గారికి కూడా కృతజ్ఞతలు. దర్శకుడిగా ఇది నాకు రెండవ అవకాశం. నా లాంటి కొత్త వాడి సినిమా కు సంగీతం ఇచ్చిన కీరవాణి గారు నిజంగా నాకు దేవుడుతో సమానం. ఆయన ఋణం తీర్చుకోలేనిది.  నేను చేస్తున్న ఈ సినిమా హిట్ కావాలని మనస్ఫూర్తిగా సహకరిస్తున్న మా యూనిట్ అందరికి ధన్యవాదాలు.  అలాగే నా మిత్రుడు మాటల రచయిత రత్నం ఒక మంచి కథను ఇచ్చాడు.  ఈ సినిమా నిర్మాత భరత్ గారికి కూడా ధన్యవాదాలు. సినిమా  మేము ముందు  అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువే అయ్యింది. కాని ఏ మాత్రం ఇబ్బంది పెట్టకుండా మాకు పూర్తిగా సహకరించారు. ప్రేక్షకులు మా సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను.” అన్నారు.
హీరో రంజిత్ మాట్లాడుతూ:  నా మొదటి సినిమా కే లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు సంగీతం అందించటం నిజంగా నా అదృష్టం. నన్ను ఆశీర్వదించటానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఇన్ని రోజులుగా నన్ను ప్రోత్సహిస్తూ వచ్చిన మా అమ్మా నాన్నలకి , మా అన్నయ్య భరత్ కి చాలా చాలా థాంక్స్. అలాగే బొత్స అంకుల్ కి థాంక్స్. సినిమా కథ చాలా బాగుంది. నిజానికి కథే హీరో. ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది”. అన్నారు.
నిర్మాత భరత్ మాట్లాడుతూ : ముఖ్య అతిధిగా విచ్చేసిన వినాయక్ గారికి,మమ్మల్ని ఆశీర్వదించిన బొత్స దంపతులకు ఇక్కడికి విచ్చేసిన అతిథులు అందరికి కృతజ్ఞతలు. సినిమా చాలా బాగా వచ్చింది. రత్నం గారి డైలాగ్స్ బాగున్నాయి. హీరొయిన్ పాలక్, విలన్ అర్జునా ఇద్దరూ చాలా బాగా నటించారు. ఫెబ్రవరి ౨౩ న సినిమా విడుదల చేస్తున్నాము. అందరూ ఆశీర్వదించి సినిమాను హిట్ చేయాలని కోరుకుంటున్నాను. “అన్నారు.
ఈ చిత్రంలో నటీనటులు: రంజిత్(హీరో), పాలక్ లల్వాని(హీరొయిన్), అర్జునా(విలన్), పోసాని కృష్ణ మురళి, ఆలీ, సప్తగిరి, మురళీశర్మ, రఘుబాబు, ప్రభాకర్, విజయ్ చందర్, ఆనంద్, ఐమాక్స్ వెంకట్, పింగ్ పాంగ్ సూర్య, జబర్దస్ట్ శ్రీను, షేకింగ్ శేషు, ప్రభాస్ శ్రీను, భద్రం, సురేఖ వాని, సన,
కథ మాటలు ఎం. రత్నం.
సాహిత్యం :- అనంత శ్రీరామ్, వశిష్ట ( ఓ కలా)
కోరియోగ్రఫీ:- గణేష్, జానీ మాస్టర్
ఆర్ట్ డైరెక్టర్: రాం అరసవిల్లి
కాస్త్యుమ్స్ డిజైనర్ : రాజేష్ కామర్సు
స్టంట్స్ : వెంకట్, నందు
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, తమ్మిరాజు
సినిమాటోగ్రఫీ: సురేష్ రగుతు
సంగీతం:- ఎం.ఎం.కీరవాణి
స్క్రీన్ ప్లే -డైరెక్షన్ :- త్రికోటి పి.
నిర్మాత: భరత్ సోమి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here