“రాజరథం”లో నిరూప్ భండారి చెప్పిన ‘దెయ్యం కథ’

నిరూప్ భండారి తన సోదరుడు అనూప్ భండారి దర్శకత్వంలో అత్యున్నత ప్రమాణాలతో  అందమైన ప్రేమకథ గా తెరకెక్కుతున్న ‘రాజరథం’ చిత్రీకరణ సమయంలో ఎన్నో సరదా సంఘటనలు జరిగినట్టు చెప్పారు. ‘రాజరథం’ లోని ‘కాలేజీ డేస్’ సాంగ్ తనని తన కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్ళిందని నిరూప్ అప్పటి సంఘటనని గుర్తు చేసుకున్నారు.
కాలేజీ రోజుల్లో నిరూప్, తన స్నేహితులతో కలిసి తరచూ రాత్రుళ్ళు మైసూర్ లోని చాముండి హిల్స్ లో ఉండే పాడుబడిన ఇంటికి వెళ్ళే వారు. అక్కడ దయ్యాలు తిరుగుతుంటాయని, అక్కడి వారు చాలా మంది తాము వాటిని చూశామని చెప్పేవారు. ఇక నిరూప్ , తన స్నేహితులతో కలిసి ఒక పాత ఎస్టీమ్ కార్ లో అక్కడికి వెళ్లేవారు. ఆ కార్ స్టార్ట్ అవడానికి సమయం తీసుకునేది. అందుకని ఏమన్నా జరిగితే అక్కడి నుండి త్వరగా వెళ్ళిపోవడానికి కార్ ఇంజిన్ ని ఆపకుండా రన్నింగ్ లో నే ఉంచేవారు. ఒకసారి తాను చేసిన సరదా (ప్రాంక్) పనిని నిరూప్ గుర్తు చేసుకున్నారు. అలా అక్కడికి వెళ్లిన ఒకసారి తానూ కావాలనే కార్ లైట్లు, ఇంజిన్ ఆఫ్ చేసేసి కార్ స్టార్ట్ అవనట్టు నటించానని, అది నిజమని నమ్మిన తన స్నేహితులకి ఆ సమయంలో భయంతో కాళ్ళు, చేతులు ఆడలేదని నిరూప్ ఆనాటి సరదా సంఘటనని గుర్తు చేసుకున్నారు.
‘రాజరథం’ లోని ‘కాలేజ్ డేస్’ పాట చిత్రీకరణ సమయంలో జరిగిన ఇలాంటి మరో సరదా విషయాన్నీ నిరూప్ పంచుకున్నారు.  ‘కాలేజ్ డేస్’ పాటలో నిరూప్ స్నేహితుడిగా కనిపించే శ్రీవత్స కి వెనక టపాసులు అంటించే దృశ్యం ఒకటి ఉంది. అందులో నిజమైన టపాసులు వాడుతున్నారని విషయం శ్రీవత్స కి తెలీదు . నిరూప్ తాను ఆ టపాసుల్ని అంటించాక వెంటనే వాటిని లాగేసి ఆర్పేయడం జరిగిందని కానీ అంతా అయ్యాక శ్రీవత్స ని చూసినప్పుడు విషయం అర్ధమైన శ్రీవత్స వణికిపోతూ కనిపించాడని, దీంతో సెట్లో అందరూ ఒక్క సారిగా నవ్వేశారన్నారు.
ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే, నిరూప్ ని కాలేజ్ లో ఎవరు ర్యాగింగ్ చేసేవారు కాదట ఒక్క అనూప్ స్నేహితులు తప్ప. రాగ్గింగ్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు చాలా సరదాగా అనిపించేదని, సీనియర్లు తమ మీద బాస్కెట్ బాల్ విసిరేయడం, వాళ్ళ కోసం బక్కెట్లు మోయడం, షూటింగ్ లో కొన్ని సార్లు బాస్కెట్ బాల్ మొహం మీద, కడుపులో కూడా గట్టిగ తగిలేదని షూటింగ్ విషయాలని నిరూప్ గుర్తు చేసుకున్నారు.
‘జాలీ హిట్స్’ నిర్మాణంలో రొమాంటిక్ కామెడీ గా తెరకెక్కుతున్న ‘రాజరథం’ ని ప్రపంచవ్యాప్తంగా మార్చి 23 న విడుదల చేయనున్నారు. ఓవర్సీస్ లో ‘జాలీ హిట్స్’ వారే పంపిణీ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here