నేనేంటి రాజకీయాలు ఏంటి.. మీకు మతి గానీ పోయిందా.. ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నారు అంటూ వస్తున్న వార్తలపై అజిత్ రియాక్షన్ ఇది. తనకు అసలు రాజకీయాలంటే తెలియవని.. తెలిసింది కేవలం సినిమాలు చేయడం మాత్రమే అని మరోసారి క్లారిటీ ఇచ్చాడు అజిత్. ఈయన బిజెపిలో చేరుతున్నారు అంటూ కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. దీనిపై చూసి చూసి చివరికి రియాక్ట్ అయ్యాడు ఈ హీరో.
లేనిపోని వార్తలు ప్రచారం చేసి అభిమానులను తప్పుదోవ పట్టించొద్దని కోరుతున్నారు అజిత్. తాను ఏ పార్టీలోనూ చేరడం లేదని.. అసలు రాజకీయాలు తన ఒంటికి పడవు అని చెబుతున్నారు ఈ హీరో. అలా రాజకీయాలు చేస్తున్నారని తన అభిమాన సంఘాలు అన్నింటినీ కొన్నేళ్ల కింద రద్దు చేసినట్లు గుర్తు చేశారు. అలాంటి తాను రాజకీయాల్లోకి ఎలా వస్తాను అంటూ ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడే కాదు జీవితంలో ఎప్పుడూ రాజకీయాల వైపు చూడనంటూ క్లారిటీ ఇచ్చేశాడు అజిత్. తన జీవితంలో రాజకీయం అంటే కేవలం క్యూలో నిలబడి ఓటు వేయడం మాత్రమే అని.. అక్కడితోనే తన రాజకీయాలు ముగిసిపోతాయి అని చెబుతున్నాడు ఈ హీరో. దీన్నిబట్టి జీవితంలో ఆయన రాజకీయాల వైపు కన్నెత్తి కూడా చూడరు అని క్లారిటీ వచ్చేసింది. ఇక మీద ఎప్పుడూ అజిత్ పై ఇలాంటి రాజకీయ రూమర్లు రావని అనుకుంటున్నారు అభిమానులు కూడా.