ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విడుదల వరకైనా అరవింద సమేత వీరరాఘవను ఆపుతారా లేదంటే ముందే లీక్ చేసి చూపిస్తారా అనేది భయంగా మారిందిప్పుడు. లేకపోతే మరేంటి.. పిక్స్ లీక్ అవుతున్నాయంటే ఏమో అనుకోవచ్చు కానీ ఎడిటింగ్ టేబుల్ మీద ఉన్న టీజర్ కూడా లీక్ అవుతుందంటే ఏం అనుకోవాలి..? త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది. ఈ చిత్రంలో నాగబాబు ఫ్యాక్షన్ లీడర్ గా నటిస్తున్నాడు. ఈయన కొడుకుగా ఎన్టీఆర్ నటిస్తున్నాడని తెలుస్తుంది.
చాలా వేగంగా అరవింద సమేత షూటింగ్ పూర్తి చేస్తున్నాడు త్రివిక్రమ్. దసరాకు విడుదల తేదీ ఉండటంతో వీర ఫాస్ట్ గా వీరరాఘవున్ని సిద్ధం చేస్తున్నాడు మాటల మాంత్రికుడు. అంతా బాగానే ఉంది కానీ ఒక్క విషయం మాత్రం ఈ చిత్రయూనిట్ ను బాగా కంగారు పెడుతుంది.. అదే లీకుల బెడద.
ఇప్పటికే ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్ బయటికి వచ్చేసాయి. ఇకిప్పుడు ఏకంగా షూటింగ్ పిక్ కూడా లీక్ అయింది. ఆ మధ్య నాగబాబు ఒంటినిండా దెబ్బలతో గాయపడుతుంటే.. ఎన్టీఆర్ అతన్ని జీప్ లో ఎక్కించుకుని బాధగా తన వైపు చూస్తుంటాడు. ఇది లీక్ అయింది. ఇప్పుడు కూడా ఇదే సీన్ కు సంబంధించిన మరికొన్ని సీన్స్ లీక్ అయ్యాయి. ఇందులో కూడా కథ అర్థం అయిపోతుంది. ఆగస్ట్ 15న ఈ చిత్ర టీజర్ విడుదల కానుంది. ఆ లోపు నెట్ లో రాకుండా జాగ్రత్త పడితే చాలు. త్రివిక్రమ్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఇంటిదొంగలే ఈ పని చేస్తుండటం అతన్ని కలవరపెడుతుంది. మరి దీనిపై అరవింద సమేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలిక..!