ఒక్క హిట్టు ఒకే ఒక్క హిట్టు వాళ్ళందరూ జాతకాలు మార్చేసింది. కొంతకాలంగా హిట్టు అనే మాటే మరచిపోయిన వాళ్లందరినీ తిరిగి ఫామ్లోకి తీసుకు వచ్చింది. ఆ సినిమా ఇంకేదో కాదు ఎఫ్ 2. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తోంది. సంక్రాంతి సినిమాలు అన్నీ ముకుమ్మడిగా చేతులెత్తేయడంతో పండగ చేసుకుంటుంది ఈ సినిమా. 5 రోజుల్లోనే ఈ చిత్రం 25 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఇదే జోరు కొనసాగితే మరో రెండు రోజుల్లో ఈ సినిమాకు సేఫ్ జోన్ కి రావడం ఖాయం. 34 కోట్ల వస్తే సేఫ్ అవుతుంది ఈ సినిమా. వెంకటేష్ ఉన్నాడు కాబట్టి కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమా వైపు పరుగులు తీస్తున్నారు. దానికితోడు పండగ సినిమాల్లో బాగా నవ్వుకునేది ఇది ఒక్కటే కావడంతో కలెక్షన్లు కూడా కురుస్తుంది.
ఈ సినిమాలో వరుణ్ తేజ్, వెంకటేష్, తమన్నా, మెహరీన్ కౌర్, దిల్ రాజు జాతకాలు మార్చేసింది. ఈ సినిమాకు ముందు అందరికీ ఫ్లాపులు ఉన్నాయి. ఇప్పుడు అందరి కష్టాలు కామన్ గా తీర్చేశారు అనిల్ రావిపూడి. మరో రెండు వారాల పాటు కొత్త సినిమాలు ఏమీ లేకపోవడం కూడా ఈ సినిమాకు కలిసి రానుంది. 50 కోట్ల షేర్ వైపు అడుగులు వేయడం ఖాయంగా కనిపిస్తోంది. అదే కానీ జరిగితే ఇప్పుడు కొత్త సంచలనం సృష్టించినట్లే. పాతిక కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. 35 కోట్ల బిజినెస్ చేసింది ఈ చిత్రం. భారీ పోటీ ఉంది కాబట్టి ఎంత వసూలు చేస్తుందా లేదా అని ఆసక్తి అనుమానాలు ఉన్నా కూడా ఇప్పుడు అన్నీ పటాపంచలైపోయాయి. ఐదు రోజుల తర్వాత కూడా జోరు తగ్గించకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. మొత్తానికి పండగ సెలవులు బాగా క్యాష్ చేసుకున్న సినిమా ఒక ఎఫ్2 మాత్రమే.