ఒక తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో బయోపిక్స్ హవా బాగా నడుస్తోంది. పెద్దగా కష్టపడకుండానే ఈ సినిమాలో కథలు సిద్ధం అయిపోతాయి. దానికి తోడు క్రేజ్ కూడా చాలానే ఉంది. లెజెండరీ వ్యక్తుల జీవితంలో జరిగిన విషయాలు తెలుసుకోవాలని ప్రేక్షకులు కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
జీవితంలో వారు పడిన కష్టాలు.. ఎక్కిన మెట్లు.. ఎదిగిన విధానం అన్ని రెండున్నర గంటల్లో దర్శకులు తెరపై ఆవిష్కరిస్తుంటే మైమరచిపోయి చూస్తున్నారు ప్రేక్షకులు. దాంతో ఇప్పుడు అందరి బయోపిక్ లు సిద్ధం అవుతున్నాయి. అందులో నరేంద్రమోడీ కూడా ఉంది. ప్రస్తుతం ఈయన బయోపిక్ అహ్మదాబాద్ లో షూటింగ్ మొదలు పెట్టుకుంది. మేరీకోమ్, భూమి లాంటి సినిమాలు తీసిన ఒమంగ్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
వివేక్ ఒబేరాయ్ ఇందులో నరేంద్ర మోడీ పాత్రలో నటిస్తున్నాడు.. కచ్చితంగా ఈ చిత్రం ప్రేక్షకులకు చేరువవుతుందని.. నరేంద్ర మోడీ జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను ఈ సినిమాలో ఉండబోతున్నాయని చెబుతున్నాడు దర్శకుడు ఒమంగ్ కుమార్. వివేక్ ఒబేరాయ్ తండ్రి సురేష్ ఓబెరాయ్ ఈ నిర్మిస్తున్నారు. ఇదే ఏడాది సినిమా విడుదల కానుంది. కచ్చితంగా నరేంద్ర మోడీ బయోపిక్ ప్రేక్షకులను అలరిస్తుందని ధీమాగా చెబుతున్నారు దర్శక నిర్మాతలు. ఇక నరేంద్ర మోడీ పాత్ర కోసం వివేక్ ఓబెరాయ్ కూడా చాలా కష్టపడుతున్నారు. ఈ మధ్య విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇరవై మూడు భాషల్లో విడుదల కానుంది మోదీ బయోపిక్.