రామ్ చరణ్ వినయ విధేయ రామ సినిమాకు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. జనవరి 11 నుంచి 19 మధ్యలో రోజుకు రెండు షోలు అదనంగా ప్రదర్శించవచ్చని థియేటర్ యాజమాన్యానికి అనుమతి ఇచ్చింది గవర్నమెంట్. తెలంగాణలో పరిస్థితి ఏంటి అనేది ఇంకా క్లారిటీ లేదు కానీ ఏపీలో మాత్రం చరణ్ సినిమాకు అదనపు షోలకు పర్మిషన్ వచ్చేసింది.
దాంతో సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్ల కుమ్మేయడం ఖాయంగా కనిపిస్తోంది. రామ్ చరణ్-బోయపాటి క్రేజీ కాంబినేషన్లో డివివి దానయ్య ఈ చిత్రాన్ని దాదాపు 60 కోట్ల బడ్జెట్ తో నిర్మించాడు. ఈ సినిమాపై అభిమానుల్లో కూడా భారీ అంచనాలున్నాయి. రంగస్థలం తర్వాత వస్తున్న సినిమా కావడంతో కచ్చితంగా చరణ్ మరో విజయం అందుకుంటాడని ధీమాగా నమ్ముతున్నారు వాళ్ళు.
దానికి తోడు వినయ విధేయ రామ హిట్ కొడితే ఒకేసారి రెండు హ్యాట్రిక్ లు అందుకుంటాడు మెగా వారసుడు. సంక్రాంతికి నాయక్, ఎవడు సినిమాలతో ఇప్పటికే విజయాలు అందుకున్న రామ్ చరణ్.. ఇప్పుడు మూడో విజయం అందుకోవాలని చూస్తున్నాడు. ఇక ధృవ, రంగస్థలం సినిమాలతో వరుసగా రెండు విజయాలు అందుకున్న చరణ్.. సంక్రాంతి సినిమాతో హ్యాట్రిక్ పూర్తిచేయాలని కలలు కంటున్నాడు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అదనంగా అనుమతి ఇవ్వడంతో చరణ్ పని మరింత ఈజీ అయిపోయింది. మొత్తానికి చూడాలిక మెగా వారసుడు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు సృష్టించబోతున్నాడో.