అకీరా ఫేవ‌రేట్ ప‌వ‌న్ కాదంట‌..!

ఏ కొడుకుకైనా తండ్రే అస‌లు హీరో. ఇక తండ్రి నిజంగానే సూప‌ర్ స్టార్ అయితే మ‌రో ఆలోచ‌న లేకుండా అత‌డే ఫెవ‌రేట్ హీరో అయిపోతాడు క‌దా. కానీ ప‌వ‌న్ కొడుకు అకీరా నంద‌న్ మాత్రం షాక్ ఇచ్చాడు. ఈయ‌న‌కు త‌న తండ్రి కంటే మ‌రో ఫేవ‌రేట్ హీరో ఉన్నాడు టాలీవుడ్ లో. ప‌వ‌న్ కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. కానీ ఆ కోట్ల‌లో కొడుకు లేక‌పోవ‌డం విచిత్రం. అకీరా త‌న‌కంటే ఎక్కువ‌గా జూనియ‌ర్ ఎన్టీఆర్ ను ఇష్ట‌ప‌డ‌తాడ‌ని చెప్పాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

ఈ మ‌ధ్యే ప‌వ‌న్ తో క‌లిసి వైజాగ్ లో కొన్ని రోజులు ఉన్నాడు అకీరా. హాలీడేస్ పూర్తైన వెంట‌నే మ‌ళ్లీ త‌ల్లి ద‌గ్గ‌రికి వెళ్లిపోయాడు. ఈ క్ర‌మంలోనే అభిమానుల‌తో మాట్లాడుతూ త‌న‌కంటే ఎక్కువ‌గా ఎన్టీఆర్ ను ఇష్ట‌ప‌డ‌తాడ‌ని.. త‌న డాన్సుల కోస‌మే మ‌ళ్లీ మ‌ళ్లీ సినిమాలు చూస్తాడ‌ని చెప్ప‌డం విశేషం. ఏదేమైనా ఇలా ఓపెన్ గా చెప్ప‌డం కూడా గొప్పే క‌దా..! ప‌వ‌న్ అది చేసాడు.. అదే ఫ్యాన్స్ కు మ‌రింత ఖుషీని ఇస్తుంది.

అన్న‌ట్లు ఆ మ‌ధ్య అర‌వింద స‌మేత ఓపెనింగ్ లో ఎన్టీఆర్ త‌న‌యుడితో ప‌వ‌న్ ఆడుకోవ‌డం కూడా అంద‌రికీ గుర్తుండే ఉంటుంది క‌దా.. అలా ఇప్పుడు ఈ రెండు కుటుంబాలు క‌లిసిపోతున్నాయి. పైగా ఎన్టీఆర్-చ‌ర‌ణ్ మ‌ల్టీస్టార‌ర్ కూడా రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్నాడు. ఇలా అంతా ఇప్పుడు క‌లిసిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here