అఖిల్ విష‌యంలో నాగ్ ఎందుకిలా..?

 

చూస్తుంటే నాగ‌చైత‌న్య‌ను పూర్తిగా నాగార్జున వ‌దిలేసిన‌ట్లుగా క‌నిపిస్తుంది. ఆయ‌న కెరీర్ లో సెట్ అయిపోయాడు. ఇప్పుడు వ‌ర‌స‌గా సినిమాలు చేస్తూ బిజీ అయిపోయాడు. ఒక‌ట్రెండు హిట్లు గానీ ప‌డితే చైతూ స్టార్ అయిపోయిన‌ట్లే. లేక‌పోయినా మీడియం రేంజ్ హీరోలా హాయిగా సెటిల్ అయిపోయాడు. అందులో నో డౌట్స్.. ఇప్పుడు ఈయ‌న మార్కెట్ 15 నుంచి 20 కోట్ల మ‌ధ్య‌లో ఉంది. రెండు హిట్లు ప‌డితే 30 కోట్ల‌కు చేర‌డం ఖాయం. అందుకే ఇప్పుడు చైతూ విష‌యం పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు నాగార్జున‌. త‌న ఫోక‌స్ మొత్తం చిన్న కొడుకు అఖిల్ పైనే పెడుతున్నాడు. ఇప్ప‌టికే ఈయ‌న న‌టించిన అఖిల్.. హ‌లో డిజాస్ట‌ర్లుగా నిలిచాయి. దాంతో ఎలాగైనా ఇప్పుడు అఖిల్ కు హిట్ ఇవ్వ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నాడు నాగ్. ఈ క్ర‌మంలోనే వెంకీ అట్లూరితో మూడో సినిమాను సెట్ చేసాడు.
ఇప్ప‌టి వ‌ర‌కు అంతా బాగానే ఉంది కానీ అఖిల్ నాలుగో సినిమా మాత్రం వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో అని అనౌన్స్ చేసారు. అది కూడా నాగార్జున నిర్మాణంలో.. ఇక్క‌డే అభిమానులు కంగారు ప‌డుతున్నారు. అఖిల్ ను తీసుకెళ్లి వ‌ర్మ చేతుల్లో పెట్ట‌డం ఏంట‌ని టెన్ష‌న్ ప‌డుతున్నారు. ఎంత న‌మ్మ‌కం ఉన్నా.. ఇప్పుడు త‌నతో సినిమా చేస్తూ ఉన్నా కూడా తీసుకెళ్లి వ‌ర్మ ఇప్పుడున్న సిచ్యువేష‌న్ లో అఖిల్ ను ఆయ‌న‌కు అప్ప‌గించ‌డం అనేది జీర్ణించుకోలేక‌పోతున్నారు అభిమానులు. మ‌రోవైపు అక్కినేని ఫ్యామిలీకి శివ త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో హిట్ ఇవ్వ‌లేదు వ‌ర్మ‌. అంతం.. గోవిందా గోవిందా.. ప్రేమ‌క‌థ‌.. మొన్నటికి మొన్న నాగ‌చైత‌న్య‌తో బెజ‌వాడ‌.. ఇలా వ‌ర్మ అన్ని ఫ్లాపులే ఇచ్చాడు. ఇప్పుడు నాగార్జున‌తో ఈయ‌న ఆఫీస‌ర్ సినిమా చేస్తున్నాడు. ఇది హిట్టైతే కానీ అఖిల్ సినిమాపై న‌మ్మ‌కం క‌ల‌గ‌దు అభిమానుల‌కు. మ‌రి చూడాలిక‌.. అఖిల్ ఏం చేస్తాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here