అడ‌ల్ట్ సినిమాకు నాగ్ ప్ర‌మోష‌న్..

NAGARJUNA-ABOUT-RX-100
అవును.. న‌మ్మ‌డానికి కాస్త క‌ష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. నిజంగానే అడ‌ల్ట్ సినిమాకు నాగార్జున ప్ర‌మోష‌న్ చేస్తున్నాడు. తాజాగా ఈయ‌న ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఆర్ఎక్స్ 100ను తెగ పొగిడేసాడు. ఈ మ‌ధ్య కాలంలో తాను బాగా మిస్ అయిన సినిమా ఇదే అన్నాడు.
త‌న అన్న‌పూర్ణ డిఐలో క్లైమాక్స్ పోర్ష‌న్ ఒక్క‌టి ఉంటే చూసాన‌ని.. అది త‌న‌కు చాలా బాగా క‌నెక్ట్ అయింద‌ని.. ద‌ర్శ‌కుడు హానెస్ట్ రైటింగ్ తో ఆక‌ట్టుకున్నాడ‌ని చెప్పాడు నాగార్జున‌. అన్ని ర‌కాల సినిమాలు వ‌స్తుంటాయి.. ఇది అడ‌ల్ట్ సినిమా. ఎ స‌ర్టిఫికేట్ ఉంది క‌దా వెళ్తే వెళ్లండి.. లేక‌పోతే లేదు. అది హిట్ అవ్వ‌డం త‌న‌కు ఏ మాత్రం ఆశ్చ‌ర్యంగా లేద‌న్నాడు నాగార్జున‌.
క‌చ్చితంగా ఫుల్ సినిమా చూస్తాన‌ని.. క్లైమాక్స్ చూసిన త‌ర్వాత ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని వెయిట్ చేస్తున్నానని చెప్పాడు కింగ్. ఈయ‌న మాట‌ల‌తో ద‌ర్శ‌కుడుతో పాటు ఆర్ఎక్స్ 100 టీం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కార్తికేయ‌, పాయ‌ల్ రాజ్ పుత్ జంట‌గా న‌టించిన ఈ చిత్రాన్ని అజ‌య్ భూప‌తి తెర‌కెక్కించాడు. ఇప్ప‌టికే 11 కోట్ల వ‌ర‌కు షేర్ వ‌సూలు చేసి బ్లాక్ బ‌స్ట‌ర్ కా బాప్ అనిపించుకుంది ఆర్ఎక్స్ 100. ఇప్పుడు నాగార్జున కూడా ఫ్రీ ప్ర‌మోష‌న్ ఇచ్చేసాడు ఈ చిత్రానికి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here