అత‌డు మ‌రో ప్రియ‌ద‌ర్శి అవుతాడా..?

ప్రియ‌ద‌ర్శి.. పెళ్లిచూపులుకు ముందు ఈయ‌న ఎవ‌రో ఎవ‌రికీ తెలియ‌దు. అప్ప‌టి వ‌ర‌కు రెండు మూడు సినిమాలు చేసినా కూడా గుర్తు కూడా ప‌ట్ట‌లేని కారెక్ట‌ర్స్ అవి. కానీ త‌రుణ్ భాస్క‌ర్ క‌ళ్ళ‌లో ప‌డి మ‌నోడి జాత‌క‌మే మారిపోయింది. ఇప్పుడు టాలీవుడ్ బిజీ క‌మెడియ‌న్స్ లో ప్రియ‌ద‌ర్శి కూడా ఒక‌రు. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రియ‌ద‌ర్శి మాదిరే మ‌రో క‌మెడియ‌న్ కూడా వ‌స్తున్నాడు. అత‌డి పేరు అభిన‌వ్.

త‌రుణ్ భాస్క‌ర్ రెండో సినిమా ఈ న‌గ‌రానికి ఏమైందిలో ఫ‌న్ పార్ట్ మొత్తం ఈయ‌నే తీసుకుంటున్నాడు. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్స్.. ప్రోమోస్ లో అభిన‌వ్ పాత్ర ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. చూస్తుంటే క‌చ్చితంగా పెళ్లిచూపులులో ద‌ర్శికి ఎంత పేరొచ్చిందో.. ఇక్క‌డ అభికి కూడా అంతే క్రేజ్ వ‌చ్చేలా క‌నిపిస్తుంది. అభిన‌వ్ కూడా గ‌తంలో కొన్ని సినిమాలు చేసాడు.

ముఖ్యంగా గ‌తేడాది సుమంత్ హీరోగా వ‌చ్చిన మ‌ళ్లీరావా సినిమాలో హీరో ఫ్రెండ్ గా న‌టించాడు. ఆ సినిమాలో గుర్తింపు వ‌చ్చినా కూడా సినిమా పెద్ద‌గా ఆడ‌క‌పోవ‌డంతో అభిన‌వ్ టాలెంట్ బ‌య‌టికి రాలేదు. ఇక ఇప్పుడు ఈ న‌గ‌రానికి ఏమైందితో మ‌రోసారి వ‌స్తున్నాడు ఈ క‌మెడియ‌న్. మ‌రి చూడాలిక‌.. అప్పుడు ప్రియద‌ర్శి మాదిరే ఇప్పుడు అభి కూడా కౌశిక్ గా కుమ్మేస్తాడేమో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here