అదంతా దేవుడిష్టం అంటున్న సాయిప‌ల్ల‌వి..

SAI PALLAVI INTERVIEW
ఓ హీరోయిన్ ఇంత సింపుల్ గా స్టార్ అయిపోవ‌చ్చా అనేంత ఈజీగా సూప‌ర్ స్టార్ అయిపోయింది సాయిప‌ల్ల‌వి. చేసింది త‌క్కువ సినిమాలే కానీ అన్నీ సూప‌ర్ హిట్టే. పైగా అన్నింట్లోనూ ఆమె కారెక్ట‌ర్స్ అద్భుతంగా పండాయి. దాంతో సాయిప‌ల్ల‌వికి తిరుగులేకుండా పోయింది. దానికి తోడు ఆమెపై రూమ‌ర్స్ కూడా అలాగే ఉన్నాయి. షూటింగ్ కు టైమ్ రాద‌ని.. ద‌ర్శ‌క నిర్మాత‌ల‌ను ఇబ్బంది పెడుతుంద‌నే రూమ‌ర్స్ ఈమైపే ఉన్నాయి. దీనిపై కూడా ధైర్యంగా స్పందించింది సాయిప‌ల్ల‌వి. ఈమె మాట‌ల్లో తెలియ‌ని ధైర్యం క‌నిపిస్తుంది. ఇండ‌స్ట్రీలో ముద్దుగుమ్మ‌లు అణుకువ‌గా ఉండాలి అనే మాట‌ల‌కు సాయిప‌ల్ల‌వి అస్స‌లు నిద‌ర్శ‌నం కాదు. ఈమె రెబ‌ల్. ఫిదాలో క‌నిపించిన‌ట్లే నిజంగా కూడా ఈమె చాలా రెబ‌ల్. ఎవ‌రైనా ఈ భామ జోలికి వ‌స్తే అంతే సంగ‌తులు. కెరీర్ లో ఎద‌గ‌డానికి త‌న‌కు ఎవ‌రి సాయం అక్క‌ర్లేద‌ని చెబుతుంది సాయిప‌ల్ల‌వి. ఈమె ధైర్యం చూసి మిగిలిన హీరోయిన్లు కూడా భ‌య‌ప‌డుతున్నారు.
తాను ఇక్క‌డికి న‌టించ‌డానికి మాత్ర‌మే వ‌చ్చాన‌ని.. అది మాత్ర‌మే చేస్తాన‌ని చెబుతుంది ఈ భామ‌. లిప్ లాప్ ఇవ్వ‌డం.. గ్లామ‌ర్ షో చేయ‌డం లాంటివి అడిగితే సినిమాలు చేయ‌న‌ని ముందే చెప్తాన‌ని చెబుతుంది సాయిప‌ల్ల‌వి. అంతేకాదు.. క‌థ విష‌యంలో తాను అస్స‌లు కాంప్ర‌మైజ్ కాన‌ని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇప్ప‌టి వ‌ర‌కు తాను చేసిన సినిమాల‌న్నీ మ‌న‌సుకు న‌చ్చి చేసిన‌వే కానీ డ‌బ్బుల కోసం కాదు.. ఇక‌పై కూడా ఇలాగే ఉంటానంటుంది సాయిప‌ల్ల‌వి. క‌థ త‌న‌కు న‌చ్చ‌క‌పోతే ఎవ‌రైనా నో చెప్పేస్తానంటుంది. ప్రేక్ష‌కులే త‌న‌కు ఈ బాధ్య‌త ఇచ్చార‌ని.. త‌ను సినిమా చేస్తున్నానంటే అందులో ఏదో ఉంటుందని ప్రేక్ష‌కులు ఊహించుకుంటార‌ని.. ఆ రెస్పాన్స‌బిలిటీతోనే ఇలాంటి మంచి క‌థ‌ల కోసం చూస్తు న్నాన‌ని చెప్పింది ఈ ముద్దుగుమ్మ‌.
ఈ మ‌ధ్యే ఓ ఇంట‌ర్వ్యూలో త‌న కెరీర్ కు సంబంధించిన చాలా విష‌యాలు బ‌య‌ట‌పెట్టింది ఈ భామ. క‌థ న‌చ్చ‌క‌పోతే సినిమాలో ఎవ‌రున్నా కూడా త‌ను ఒప్పుకునే స‌మ‌స్యే లేద‌ని చెప్పింది సాయిప‌ల్ల‌వి. అలా తాను కొన్ని సినిమాలు వ‌దిలేసాన‌ని.. దాంతో త‌న‌పై కావాల‌నే ఇండ‌స్ట్రీలో కొన్ని రూమ‌ర్లు బ‌య‌టికి వ‌చ్చాయ‌ని చెబుతుంది ఈ భామ‌. కావాల‌నే తాను సినిమాలు వ‌దిలేస్తున్నాన‌ని.. ఆటిట్యూడ్ చూపిస్తున్నాన‌ని.. ఇష్ట‌మొచ్చిన‌ట్లు షూటింగ్ టైమింగ్స్ వ‌స్తాన‌ని త‌న‌పై కొంద‌రు గాసిప్స్ చెబుతున్నార‌ని చెప్పింది సాయిప‌ల్ల‌వి. అవి త‌న వ‌ర‌కు కూడా వ‌చ్చింద‌ని చెబుతుంది ఈ భామ‌. అయితే వాటి గురించి ప‌ట్టించుకుని అన‌వ‌స‌రంగా వాటిని పెద్ద‌ది చేయ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని చెప్పింది సాయిప‌ల్ల‌వి. అంతేకాదు తెలుగులో త‌న‌కు లైఫ్ ఇచ్చిన దిల్ రాజు సినిమాను సాయిప‌ల్ల‌వి వ‌దిలేసింద‌నే వార్త‌లు ఈ మ‌ధ్య వ‌చ్చాయి. దీనిపై కూడా మ‌న‌సు విప్పింది ఈ భామ‌. అవును.. నిజంగానే దిల్ రాజు సినిమా వ‌ద్ద‌న్నాన‌ని తేల్చింది ఈ బ్యూటీ.
దిల్ రాజు.. ఈ మ‌ధ్యే సాయిప‌ల్ల‌వికి ఓ క‌థ చెప్పించాడు. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో దాగుడు మూత‌లు సినిమా కోసం సాయిప‌ల్ల‌విని అడిగాడు రాజు. అయితే ఈ క‌థ న‌చ్చ‌క‌పోవ‌డంతోనే మొహంపైనే నో చెప్పింది ఈ భామ‌. నిజంగానే హ‌రీష్ శంక‌ర్ సినిమాల్లో హీరోయిన్ల‌కు పెద్ద‌గా రోల్ ఉండ‌దు. అలా ఉండ‌క‌పోతే సాయిప‌ల్ల‌వి అక్క‌డ ఉండ‌దు. తాను దిల్ రాజు సినిమా మాత్ర‌మే కాద‌ని.. అంతకు ముందు మ‌ణిర‌త్నం చెలియా సినిమా.. విక్ర‌మ్ ధృవ న‌క్ష‌త్రం సినిమాలు కూడా వ‌దిలేసాన‌ని చెప్పింది సాయిప‌ల్ల‌వి. త‌న‌కు క‌థ‌ న‌చ్చ‌క‌పోతే హీరో ఎవ‌రనేది కూడా చూడ‌న‌ని ఓపెన్ గా చెప్పింది ఈ మ‌ల‌ర్. అది త‌న ఆటిట్యూడ్ అనుకోండి.. పొగ‌రు అనుకోండి.. దానివ‌ల్ల త‌న‌కొచ్చే న‌ష్ట‌మేం లేద‌ని చెప్పింది ఈ ముద్దుగుమ్మ‌. ప్ర‌స్తుతం తెలుగులో హ‌ను రాఘ‌వ‌పూడి-శ‌ర్వానంద్ సినిమాలో న‌టిస్తుంది ప‌ల్ల‌వి. ఇక త‌మిళ‌నాట సూర్య-సెల్వ సినిమాతో పాటు ధ‌నుష్ మారి 2లో న‌టిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here