అదేంటి.. భ‌ర‌త్ 40 కోట్లు త‌గ్గాడు..!


ఒక్క వారంలోనే త‌మ సినిమా 161 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసిందంటూ నిర్మాత అఫీషియ‌ల్ గా ప్ర‌టించాడు. కానీ ఆ పోస్ట‌ర్ విడుద‌లైనప్ప‌ట్నుంచి భ‌ర‌త్ సాధించిన విజ‌యం కంటే చూపించిన ఫేక్ క‌లెక్ష‌న్ల‌పై ర‌చ్చ ఎక్కువైంది. ఎందుకు వ‌చ్చిన మంచి విజ‌యాన్ని కూడా ఫేక్ చూపించి నాశ‌నం చేస్తున్నారు అంటూ భ‌ర‌త్ అనే నేను సినిమాపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. మొన్న జ‌రిగిన స‌క్సెస్ మీట్ లో నిజంగానే త‌మ సినిమా 161 కోట్లు వ‌చ్చాయంటూ మ‌ళ్లీ క‌న్ఫ‌ర్మ్ చేసాడు నిర్మాత‌.
కానీ ఏం అనుకున్నాడో ఏమో కానీ.. రెండు రోజుల త‌ర్వాత 125 కోట్ల గ్రాస్ అంటూ మ‌రో పోస్ట‌ర్ విడుద‌ల చేసాడు. అది కూడా 9 రోజుల్లో. అప్పుడేమో వారం రోజుల్లోనే 161 కోట్ల గ్రాస్ అంటూ పోస్ట‌ర్ విడుద‌ల చేసి విమ‌ర్శ‌లు తిన్నా.. వెంట‌నే తేరుకుని 40 కోట్లు త‌గ్గించి 125 కోట్లు గ్రాస్ అంటూ కొత్త పోస్ట‌ర్ విడుదల చేసాడు. దాంతో చివాట్లు ప‌డితే కానీ నిర్మాత‌లు దారికి రారంటూ సెటైర్లు పేలుతున్నాయి.
ఇలా వ‌చ్చింది వేసుకుంటే మంచిదే క‌దా అంటూ అభిమానులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిత్రం 80 కోట్ల షేర్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో 56 కోట్లు వ‌సూలు చేసింది ఈ చిత్రం. ఇంకా సేఫ్ కావాలంటే 16 కోట్లు రావాలి. తెలుగు రాష్ట్రాల్లో 72 కోట్ల‌కు అమ్మారు ఈ చిత్రాన్ని. ఇక ఓవ‌ర్సీస్ లో కూడా మ‌రో 4 కోట్లు బాకీ. మొత్తానికి చూడాలిక‌.. భ‌ర‌త్ జ‌ర్నీ చివ‌రివ‌ర‌కు ఎలా ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here