అను ఎమ్మాన్యువ‌ల్ కు అది ఓ వ‌రం..

ANU EMMANUEAL VISA ADAVANTAGE
వ‌ర‌స‌గా ఇన్ని ప్లాపులు వ‌స్తున్నాయి.. కానీ అను ఎమ్మాన్యువ‌ల్ మాత్రం ఇంకా ఇండ‌స్ట్రీలో ఉంది. ఇప్ప‌టికీ ఈమె గురించి హీరోలు ఆలోచిస్తున్నారు. ద‌ర్శ‌కులు కూడా ఈ భామ‌కు ఛాన్స్ ఇవ్వ‌చ్చులే అనుకుంటున్నారు. అస‌లు అను ఎమ్మాన్యువ‌ల్ లో అంత ప్ర‌త్యేక‌థ ఏముంది అనుకుంటున్నారా..? ఉంది.. మిగిలిన హీరోయిన్ల‌తో పోలిస్తే అనులో ఓ ప్ర‌త్యేక‌థ ఉంది. ఇదే ఈ భామ‌కు అవ‌కాశాలు వ‌చ్చేలా చేస్తుంది. నిజానికి ఈమె మ‌ళ‌యాలి అయినా కూడా పుట్టింది పెరిగింది మొత్తం యుఎస్ లోనే. అక్క‌డి సిటిజ‌న్ షిప్ కూడా ఉంది. అప్పుడ‌ప్పుడూ ఇండియాకు రావ‌డం త‌ప్ప ఇండియ‌న్ మాత్రం కాదు ఈ భామ‌.
ఇదే ఈమె కెరీర్ కు వ‌రంగా మారింది. అను ఎమ్మాన్యువ‌ల్ తో ఫారెన్ షూటింగ్స్ చాలా ఈజీ.
ఎందుకంటే 180 దేశాల్లో ఈమెకు వీసా స‌మ‌స్య లేదు. ఎప్పుడైనా ఎక్క‌డైనా వెళ్లొచ్చు.. రావ‌చ్చు. మిగిలిన హీరోయిన్ల‌తో సినిమాలు చేస్తున్న‌పుడు వీసా స‌మ‌స్య‌లు చాలానే వ‌స్తాయి. కానీ అనుతో ఈ ఇబ్బంది ఉండ‌దు. అందుకే ఈ భామ‌తో ఫారెన్ షూటింగ్స్ ఉన్న‌పుడు లాభం. ఈ విష‌యాన్ని కూడా దృష్టిలో ఉంచుకున్నారు ద‌ర్శ‌కులు. పైగా అందాల ఆర‌బోత‌లోనూ ర‌చ్చ చేస్తుంది అను. ప్ర‌స్తుతం శైల‌జారెడ్డి అల్లుడులో న‌టిస్తుంది అను ఎమ్మాన్యువ‌ల్. ఇది కానీ ఆడిందంటే మ‌ళ్లీ అనుకు తెలుగులో మంచి రోజులు వ‌చ్చిన‌ట్లే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here