అన్నింటికి ఓకే అంటున్న కాజ‌ల్..


కెరీర్ ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు. అన్నీ బాగున్న‌పుడు ఏం చేసినా చెల్లుతుంది. కానీ ఇది సినిమా ఇండ‌స్ట్రీ. ఇక్క‌డ రాత్రికి రాత్రే జాత‌కాలు మారిపోతుంటాయి. ప్ర‌తీ శుక్ర‌వారం మారిపోయే జాత‌కం ఇక్క‌డి వాళ్లది. అలాంటి ఇండ‌స్ట్రీలో ఉన్న‌పుడు ప‌ట్టువిడుపులు కూడా ఉండాలి.
కాజ‌ల్ ఇప్పుడు ఇదే అల‌వాటు చేసుకుంది. మొన్న‌టి వ‌ర‌కు స్టార్ స్టార్ అంటూ పెద్ద హీరోల‌తో న‌టించిన కాజ‌ల్.. ఇప్పుడు సింపుల్ గా చిన్న హీరోల‌తో స‌ర్దుకుపోతుంది. భూమి గుండ్రంగా తిరుగుతుంద‌న్న‌ట్లు ఎక్క‌డైతే మొద‌లుపెట్టిందో అక్క‌డే ఆగింది. కొత్త హీరోయిన్లు వ‌స్తున్నా.. పోటీ ఇంత‌గా ఉన్నా.. కాజ‌ల్ అంటే ఇప్ప‌టికీ ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కే ఇష్ట‌మే.
అందుకే రెండు కోట్లు ఇచ్చి మ‌రీ బెల్లంకొండ శ్రీ‌నివాస్ త‌న త‌ర్వాతి రెండు సినిమాల్లో ఈ భామ‌తోనే జోడీ క‌డుతున్నాడు. ఇప్ప‌టికే శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న కాజ‌ల్-బెల్లంకొండ‌.. తేజ సినిమాలోనూ కంటిన్యూ అవుతున్నారు. ఇదిలా ఉంటే రెమ్యున‌రేష‌న్ కోస‌మే ఇప్పుడు చిన్న హీరోలతో జోడీ క‌డుతుంది కాజ‌ల్. తాజాగా మ‌రో సినిమాలోనూ న‌టించ‌డానికి ఒప్పుకుంది ఈ బ్యూటీ.
అది కూడా చిన్న హీరోతోనే. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క్రాంతిమాధవ్ తెర‌కెక్కించ‌బోయే సినిమాలో కాజ‌ల్ ను హీరోయిన్ గా అనుకుంటున్నారు. క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ బ్యాన‌ర్ పై కేఎస్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాడు. మొత్తానికి కెరీర్ చ‌ర‌మాంకంలో ఉంది కాబ‌ట్టి ఇప్పుడు స్టార్స్ అంటూ కూర్చోవ‌డం కంటే కూడా వ‌చ్చిన అవకాశాల‌నే వాడుకుంటూ స్టార్ హీరోయిన్ గా కొన‌సాగుతుంది కాజ‌ల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here