అన్న‌కోసం త‌మ్ముడు.. త‌న‌యుడి కోసం తండ్రి.. 

Nandamuri
లెక్క అర్థం కాలేదు క‌దా..! అంతే మ‌రి.. నంద‌మూరి లెక్క‌లు అంత ఈజీగా అర్థం కావు. ఈ లెక్క‌లో త‌న‌యుడు, అన్న‌య్య ఇద్ద‌రూ క‌ళ్యాణ్ రామే. అక్క‌డ త‌మ్ముడు ఎన్టీఆర్ అయితే.. తండ్రి హ‌రికృష్ణ‌. ఈ ముగ్గురు క‌లిసి న‌టిస్తే చూడాల‌ని నంద‌మూరి అభిమానులు చాలా కాలంగా వేచి చూస్తు న్నారు. ఆ టైమ్ ఇప్ప‌టి వ‌ర‌కు రాలేదు. ఇప్పుడు వ‌చ్చేలా క‌నిపిస్తుంది. అన్నీ కుదిర్తే త్వ‌ర‌లోనే ఈ నంద‌మూరి కుటుంబాన్ని ఒకే తెర‌పై చూసే అవ‌కాశం అభిమానుల‌కు ద‌క్క‌నుంది. క‌ళ్యాణ్ రామ్ త్వ‌ర‌లోనే ప‌వ‌న్ సాధినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఈ చిత్రం సోషియో ఫాంట‌సీగా భారీ బ‌డ్జెట్ తో రూపొంద‌నుంది. త‌న ఎన్టీఆర్ బ్యాన‌ర్ లోనే ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నాడు క‌ళ్యాణ్ రామ్. ప్ర‌స్తుతం ఈయ‌న న‌టిస్తున్న ఎమ్మెల్యే సినిమా పూర్తి కాగానే అది ప‌ట్టాలెక్క‌నుంది.
క‌ళ్యాణ్ రామ్ సినిమాలో అతిథి పాత్ర‌ల్లో ఎన్టీఆర్, హ‌రికృష్ణ న‌టిస్తార‌ని తెలుస్తుంది. ఇప్ప‌టికే ఎమ్మెల్యేతో పాటు నా నువ్వే సినిమాలోనూ న‌టిస్తున్నాడు క‌ళ్యాణ్ రామ్. ఈ రెండూ పూర్తైన త‌ర్వాతే ప‌వ‌న్ సాధినేని సినిమా ప‌ట్టాలెక్క‌నుంది. ఎమ్మెల్యే మార్చ్ 28న విడుద‌ల కానుంది. ఈ చిత్రాన్ని క‌ళ్యాణ్ రామ్ స్నేహితులు నిర్మిస్తున్నారు. కాజ‌ల్ హీరోయిన్. రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న క‌థ‌తో ఈ చిత్రం వ‌స్తుంది. ఇందులో కుర్ర ఎమ్మెల్యేగా ర‌ప్ఫాడించ‌బోతున్నాడు క‌ళ్యాణ్ రామ్. అయినా నంద‌మూరి ఫ్యామిలీకి రాజ‌కీయాలు కొత్తా ఏంటి..? అది సినిమా అయినా.. బ‌య‌ట అయినా ఆడుకుంటారంతే. ఇక జ‌యేంద్ర తెర‌కెక్కిస్తోన్న నా నువ్వే కూడా ఇదే ఏడాది విడుదల కానుంది. ఆ త‌ర్వాత నంద‌మూరి మ‌ల్టీస్టార‌ర్ ప‌ట్టాలెక్క‌నుంది. మ‌రి చూడాలిక‌.. అన్న‌య్య కోసం త‌మ్ముడు.. త‌న‌యుడి కోసం తండ్రి చేయ‌బోయే ఆ అతిథి పాత్ర‌లు ఎలా ఉండ‌బోతున్నాయో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here