అన్న‌ద‌మ్ములిద్ద‌రూ ఆ ద‌ర్శ‌కుడి కోసం..!

Surya Wishes Karthi Over ‘Khakee’
ద‌క్షిణాది ఇండ‌స్ట్రీలో ఉన్న క్రేజీ బ్ర‌ద‌ర్స్ లో సూర్య కార్తి కూడా ఉన్నారు. తెలుగు, త‌మిళ ఇండ‌స్ట్రీలో ఈ హీరోల‌కు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇద్ద‌రు హీరోల‌ను క‌లిపి మ‌ల్టీస్టార‌ర్ చేయాల‌ని చాలా ఏళ్లుగా చాలా మంది నిర్మాత‌లు.. ద‌ర్శ‌కులు ట్రై చేస్తున్నారు కానీ ఇప్ప‌టి వ‌ర‌కు కుద‌రలేదు. అయితే ఈ కోరిక‌ను త్వ‌ర‌లోనే తీరుస్తామంటున్నారు ఈ బ్ర‌ద‌ర్స్. ఇదిలా ఉంటే సినిమా కోసం కాక‌పోయినా.. ఒకే సినిమా కోసం సూర్య‌-కార్తిని క‌లుపుతున్నాడు ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భు. ఈయ‌న త‌న సినిమాలో ఈ బ్ర‌ద‌ర్స్ ఇద్ద‌ర్ని వాడేసుకుంటున్నాడు.
ఈ ద‌ర్శ‌కుడితో ఇద్ద‌రికి మంచి అనుబంధం ఉంది. కార్తితో బిర్యానీ.. సూర్య‌తో రాక్ష‌సుడు సినిమాలు చేసాడు వెంక‌ట్. అయితే ఈ రెండు సినిమాలు పెద్ద‌గా ఆడ‌లేదు.. అది వేరే విష‌యం. ప్ర‌స్తుతం త‌ను తెర‌కెక్కి స్తోన్న పార్టీ సినిమా కోసం సూర్య కార్తి ఇమేజ్ వాడుకుంటున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇందులో ఈ బ్ర‌ద‌ర్స్ ఇద్ద‌రూ క‌లిసి పాట పాడుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ సినిమా కోస‌మే పాడుకోని వీళ్లు వెంక‌ట్ కోసం గొంతు స‌వ‌రించుకుంటున్నారు.
ఇందులో రెజీనా.. ర‌మ్య‌కృష్ణ లాంటి వాళ్లు న‌టిస్తున్నారు. మ‌రి చూడాలిక‌.. పార్టీకి ఈ బ్ర‌ద‌ర్స్ కంట్రిబ్యూష‌న్ ఎంత‌వ‌ర‌కు ప‌నికొస్తుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here