అబ్బా హ‌న్సిక‌.. ఎంత చిక్కెన‌మ్మా..?


 
హ‌న్సిక అన‌గానే మ‌న‌కు తెలియ‌కుండానే మ‌న‌సులో ఓ రూపం గుర్తొస్తుంది. ఆ రూపంలో బొద్దందాలే క‌ళ్ల ముందుకు వ‌స్తాయి. ఎందుకంటే కెరీర్ మొద‌ట్లో దేశ‌ముదురు.. కంత్రి మిన‌హా అన్నింట్లోనూ బొద్దుగానే క‌నిపించింది హ‌న్సిక‌. ఎప్ప‌టిక‌ప్పుడు బ‌రువు త‌గ్గాల‌ని చూసినా కూడా కుద‌ర్లేదు. పైగా అవ‌రోళ్ల‌కు బొద్దుగుమ్మలంటే బాగా ఇష్టం.
దాంతో ఈ ముద్దుగుమ్మ‌కు అక్క‌డోళ్లు ఇట్టే క‌నెక్ట్ అయిపోయారు. ఆ త‌ర్వాత ఫిజిక్ పై హ‌న్సిక కూడా దృష్టి త‌గ్గించేసింది. మ‌రింత బ‌రువు పెరిగిపోయింది. పాతికేళ్ల‌కే ఆంటీలా మారిపోవ‌డంతో తెలుగులో అస‌లు అవ‌కాశాలు రావ‌డ‌మే క‌ష్ట‌మైపోయాయి. కానీ ఇప్పుడు మ‌ళ్లీ బ‌రువు త‌గ్గే ప‌నిలో బిజీ అయిపోయింది హ‌న్సిక‌.
ఇప్పుడు విడుద‌లైన కొన్ని స్టిల్స్ చూస్తుంటే అమ్మాయి ఎంత‌గా మారిందో అర్థం చేసుకోవ‌చ్చు. పూర్తిగా బ‌రువు త‌గ్గిపోయి.. మెరుపుతీగ‌లా మారిన హ‌న్సిక‌ను కూడా ఔరా అనుకుంటున్నారు ప్రేక్ష‌కులు. చ‌క్క‌న‌మ్మా చిక్కినా అంద‌మే అన్న‌ట్లు హ‌న్సిక ఎలా ఉన్నా కూడా అందాల ముద్దుగుమ్మే. మ‌రి ఇప్పుడైనా ఈమెకు అవ‌కాశాలు ఇస్తారో లేదో చూడాలిక‌..!
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here