అమీర్ టాప్.. కానీ ప్ర‌భాస్ తోపు..!

PRABHAS AAMIR KHAN
అర్థం కాలేదు క‌దా లాజిక్..! ఇండియాలో నెంబ‌ర్ వ‌న్ హీరో ఎవ‌రు అంటే మ‌రో అనుమానం లేకుండా అంతా చెప్పే పేరు అమీర్ ఖాన్. వ‌సూళ్ల ప‌రంగా ఈయ‌న కంటే తోపు ఎవ‌రూ లేరు. కానీ అంద‌ర్నీ క్రాస్ చేసినా కూడా ప్ర‌భాస్ విష‌యంలో మాత్రం వెన‌క‌బ‌డుతున్నాడు అమీర్. బాహుబ‌లి 2 కాదు.. తాజాగా సాహోతోనూ అమీర్ కు షాకిచ్చాడు ప్ర‌భాస్. బ‌డ్జెట్ విష‌యంలో అటు అమీర్.. ఇటు ప్ర‌భాస్ పోటీ ప‌డుతున్నారు.
ఇండియన్ సినిమాలో ఇప్ప‌టి వ‌ర‌కు సింగిల్ షెడ్యూల్ కోసం భారీ బ‌డ్జెట్ పెట్టిన సినిమాల లిస్ట్ లో సాహో తొలి స్థానంలో ఉంది. దుబాయ్ లో జ‌రిగిన యాక్ష‌న్ సీక్వెన్సుల కోసం ఏకంగా 90 కోట్లు ఖ‌ర్చు చేయించాడు ద‌ర్శ‌కుడు సుజీత్. ఇండియ‌న్ సినిమాలో ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌ని స్టంట్స్ ఇందులో డిజైన్ చేస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇదిలా ఉంటే ఇప్పుడు అమీర్ ఖాన్ థ‌గ్స్ ఆఫ్ హిందుస్థాన్ యాక్ష‌న్ సీక్వెన్స్ 45 రోజుల పాటు యూర‌ప్ లో జ‌రిగింది. అమితాబ్, క‌త్రినా కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ధూమ్ 3 ఫేమ్ విజ‌య్ కృష్ణ ఆచార్య తెర‌కెక్కిస్తున్నాడు.
ఈ షెడ్యూల్ కోసం 80 కోట్లు ఖ‌ర్చు చేసారు. సాహో కంటే ప‌ది కోట్లు త‌క్కువే ఇది. బ‌డ్జెట్ విష‌యంలోనూ సాహో హ‌ద్దులు దాటేస్తుంది. ఈ చిత్రం దాదాపు 300 కోట్ల‌తో తెర‌కెక్కుతుంటే.. థ‌గ్స్ ఆఫ్ హిందుస్థాన్ బ‌డ్జెట్ 250 కోట్ల వ‌ర‌కు ఉంది. మ‌రి చూడాలి.. రేపు విడుద‌లైన త‌ర్వాత అమీర్ ఖాన్ ను అప్పుడు నిజంగానే ప్ర‌భాస్ బీట్ చేస్తే ఇండియ‌న్ అఫీషియ‌ల్ నెంబ‌ర్ వ‌న్ గా మ‌న హీరో అవ‌త‌రిస్తాడు లేదంటే అమీర్ ఖాన్ ఎప్ప‌ట్లాగే అగ్ర‌పీఠంపై కాలు మీద కాలేసుకుని కూర్చుంటాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here