అమ్మో.. ఏంటి సాయిప‌ల్ల‌వి ధైర్యం..?

sai pallavi
స్టార్ హీరోలంటే ఎన్ని ఫ్లాపులు వ‌చ్చినా.. మ‌ళ్లీ లేస్తారు. వాళ్ల‌కు నిర్మాత‌లు ఎప్పుడూ క్యూ క‌డుతూనే ఉంటారు. కానీ హీరోయిన్ల విష‌యంలో అలా కాదు. ఇప్పుడున్న పోటీలో స్టార్ హీరోయిన్ అవ్వాలంటే చాలా త్యాగాలు చేయాలి.. ఎన్నో కాంప్ర‌మైజ్ అవ్వాలి.. కానీ తాను ఆ టైప్ కాదంటోంది సాయిప‌ల్ల‌వి. ఈ భామ మాట‌లు చూస్తుంటే ఎవ‌రికైనా ఆశ్చ‌ర్యంతో పాటు అమ్మో అనిపించ‌క మాన‌దు. అస‌లు స్టార్ హీరోయిన్ అవ్వాలంటే టాలెంట్ ఉంటే స‌రిపోతుంది అంటుంది సాయిప‌ల్ల‌వి. ఆ పాత్ర‌కు తాను సూట్ అవుతాన‌ని ద‌ర్శ‌కులు న‌మ్మితే తాను చేస్తాన‌ని.. క‌థ న‌చ్చ‌క‌పోతే స్టార్ హీరోను కూడా లెక్క చేయ‌న‌ని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇది వ‌ర‌కే విక్ర‌మ్ ధృవ‌న‌క్ష‌త్రం.. మ‌ణిర‌త్నం చెలియా సినిమాలు ఇలాగే వ‌దిలేసాన‌ని చెప్పింది సాయిప‌ల్ల‌వి.
ఇక ఇప్పుడు దిల్ రాజు చెప్పిన క‌థ కూడా ఒక‌టి న‌చ్చ‌క‌పోవ‌డంతో వ‌దిలేసాన‌ని చెబుతుంది సాయిపల్ల‌వి. ఆ సినిమా దాగుడుమూత‌లు అని తెలుస్తుంది. హ‌రీష్ శంక‌ర్ సినిమాల్లో హీరోయిన్ల‌కు పెద్ద‌గా ఇంపార్టెన్స్ ఉండ‌దు. జ‌స్ట్ పాట‌ల‌కు వ‌చ్చి వెళ్ల‌డం త‌ప్ప‌. మొన్న డిజేలో కూడా ఇది క‌నిపించింది. దాంతో సాయిప‌ల్ల‌వి నిర్దాక్ష‌ణ్యంగా నో చెప్పేసింది. త‌న‌కు క‌థ న‌చ్చ‌క‌పోతే మాత్ర‌మే నో చెబుతున్నాన‌ని.. దాంతో త‌న‌పై ఇండ‌స్ట్రీలో కొన్ని రూమ‌ర్స్ వ‌స్తున్నాయ‌ని చెప్పింది ఈ ముద్దుగుమ్మ‌. సాయిప‌ల్ల‌వికి ఆటిట్యూడ్ ఉంద‌ని.. టైమింగ్స్ పాటించ‌ద‌ని చెబుతున్నార‌ని.. అందువ‌ల్ల త‌న‌కు వ‌చ్చే న‌ష్ట‌మేం లేద‌ని చెబుతుంది ఈ భామ‌. మొత్తానికి ఈ కాలంలో కూడా ఇంత‌టి ధైర్యం ఉన్న హీరోయిన్ ను చూసి అంతా షాక్ అవుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here