అమ‌లాపాల్.. అస‌లు త‌గ్గ‌ట్లేదుగా..!

పెళ్లికి ముందు.. పెళ్లికి త‌ర్వాత అమ్మాయిల్లో మార్పులు వ‌స్తాయంటే ఏమో అనుకున్నారు కానీ ఇప్పుడు అమ‌లాపాల్ ను చూస్తుంటే ఇది నిజ‌మే అనిపిస్తుంది. ఈమెకు ఏదో అయిపోయింది. హీరోయిన్ గా ఉన్న‌పుడు కూడా ఇంత గ్లామ‌ర్ షో చేయ‌లేదు అమ‌లాపాల్.. కానీ ద‌ర్శ‌కుడు ఏఎల్ విజ‌య్ ను పెళ్లాడి విడాకులు తీసుకున్న త‌ర్వాత మాత్రం అమ‌లాపాల్ లో చాలా మార్పులు వ‌చ్చాయి. అస‌లు భ‌ర్తపై ఉన్న కోపమో.. లేదంటే మ‌రే కార‌ణ‌మో ఏమో గానీ ఇష్ట‌మొచ్చిన‌ట్లు రెచ్చిపోతుంది. ఇదివ‌ర‌క‌టి కంటే రెండింత‌లు అందాలు ఆర‌బోస్తుంది. చిట్టిపొట్టి క్యాస్ట్యూమ్స్ లో సెగ‌లు పుట్టిస్తోంది ఈ బ్యూటీ. ఇప్పుడు మ‌రో మ్యాగ‌జైన్ కోసం అందాలు ఆర‌బోసింది అమలాపాల్. దానికితోడు ఈ మ‌ధ్యే ఓ మ‌ళ‌యాలం సినిమా కోసం ఏకంగా సిగ‌రెట్లు కాలుస్తూ.. మందు తాగుతూ ర‌చ్చ చేసింది. జిమ్ లో తాను చేస్తోన్న వ‌ర్క‌వుట్స్ కూడా తీసి నెట్ లో పెట్టేసింది ఈ కేర‌ళ‌కుట్టి. అంత‌టితో ఆగ‌కుండా దానికి కొటేష‌న్లు కూడా పెట్టింది అమ‌లాపాల్. ఇక ఇప్పుడు పెద‌వులకు ఎర్ర‌గా లిప్ స్టిక్ పెట్టుకుని హాట్ హాట్ పోజులిచ్చింది అమ‌ల‌పాల్. ఇది చూసిన త‌ర్వాత కుర్రాళ్ల‌కు నిద్ర కూడా రాదేమో..? అదే అనుకుంటే.. దానికి ఓ కొటేష‌న్ కూడా ఇచ్చింది ఈ భామ‌. లిప్ స్టిక్ ఎక్కువ‌గా వేసుకోకండి.. ముద్దులాట‌కు స‌మ‌స్య వ‌స్తుందంటే రెచ్చ‌గొడుతుంది ఈ ముద్దుగుమ్మ‌. మొత్తానికి అమ‌లాపాల్ అందాల ఆర‌బోత‌తో అంద‌రికీ పిచ్చెక్కిపోతుందిప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here