అయ్యో.. ఆ సినిమా మ‌ళ్లీ వాయిదా..!

Sakshyam movie shooting in Dubai
ఏ మాటకా మాటే..! ఈ మ‌ధ్య సినిమాలు ఏవీ చెప్పిన టైమ్ కు రావ‌డం లేదు. రిలీజ్ డేట్ ఒక‌టి ముందే అనౌన్స్ చేస్తారు. అది ద‌గ్గ‌ర ప‌డుతున్నా కూడా ప‌ట్టించుకోరు. చివ‌రికి చావుక‌బురు చ‌ల్ల‌గా చెబుతున్నారు. ఇప్పుడు కాదు అప్పుడొస్తాం అంటూ..! ఈ మ‌ధ్య చాలా సినిమాల‌కు ఇదే జ‌రిగింది. ఇప్పుడు సాక్ష్యం సినిమా కూడా అంతే.
బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్ హీరోగా శ్రీ‌వాస్ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రం మే 11నే విడుద‌ల కావాల్సి ఉంది. కానీ అనుకోని కార‌ణాల‌తో జూన్ 14కి విడుద‌ల అన్నారు. కానీ ఇప్పుడు ఆ రోజు కూడా రావ‌డం లేదు. మ‌రో నెల రోజుల పాటు సినిమా పోస్ట్ పోన్ అయింది. కార‌ణం ఏంట‌ని అడిగితే విజువ‌ల్ ఎఫెక్ట్స్ ఆల‌స్యం అవుతున్నాయి అంటున్నారు. ఈ చిత్ర క‌థ పంచ‌భూతాల చుట్టూ తిరుగుతుంది. ఇందులో హీరో అనాథ‌. కొన్ని అతీత శ‌క్తులు ఈ కుర్రాడికి అండ‌గా ఉంటాయి.
పంచ‌భూతాలే అన్నింటికీ సాక్ష్యం అనేది ఈ చిత్ర కాన్సెప్ట్. దీనికి త‌గ్గ‌ట్లే సినిమాలో చాలా విఎఫ్ఎక్స్ ఉంటుంద‌ని తెలుస్తుంది. బాహుబ‌లి సినిమాకు ప‌ని చేసిన టీం ఇప్పుడు సాక్ష్యం కోసం రంగంలోకి దిగారు. వాళ్లు ఇంకా టైమ్ కావాల‌ని కోర‌డంతో సినిమాను జూన్ 14 నుంచి జులై 20కి వాయిదా వేసారు. ఇందులో బెల్లంకొండ‌కు జోడీగా పూజాహెగ్డే న‌టిస్తుంది. భారీ బ‌డ్జెట్ తో అభిషేక్ పిక్చ‌ర్స్ ఈ సాక్ష్యంను నిర్మిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు కెరీర్ లో స‌రైన హిట్ లేని బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఈ సాక్ష్యంతో త‌న స‌త్తా చూపించాల‌ని చూస్తున్నాడు. మ‌రి చూడాలిక‌.. ఏం జ‌రుగుతుందో..? ఈ సారైనా అనుకున్న స‌మ‌యానికి సాక్ష్యం చెప్తారో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here