అర‌వంలోకి అత్తారింటికి దారేది..!

Pawan Kalyan Is Not Acting With His Brother
ఇన్నాళ్లూ తీసుకున్న అప్పుకు ఇప్పుడు బాకీ తీర్చ‌బోతున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. త‌న కెరీర్ లో ఎప్పుడూ త‌మిళ్ నుంచి ఇక్క‌డికి సినిమాలు తెచ్చుకోవ‌డ‌మే కానీ.. ఇక్క‌డ్నుంచి అక్క‌డ రీమేక్ అయిన సినిమాలు అరుదు. అప్పుడెప్పుడో ఒక్క‌సారి మ‌న త‌మ్ముడు సినిమాను త‌మిళ్ లో బ‌ద్రిగా రీమేక్ చేసాడు విజ‌య్. ఆ త‌ర్వాత అన్నీ అక్క‌డ్నుంచి ఇక్క‌డికి వ‌చ్చిన క‌థలే.
అయితే ఇప్పుడు చాలా ఏళ్ల త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా త‌మిళ్లో రీమేక్ కాబోతుంది. ఇక్క‌డ ఇండ‌స్ట్రీ రికార్డులు తిర‌గ‌రాసిన అత్తారింటికి దారేది త‌మిళ్ లో రీమేక్ కాబోతుంది. ఇక్క‌డ ప‌వ‌న్, స‌మంత‌, ప్ర‌ణీత జంట‌గా న‌టించారు.
న‌దియా అత్త‌గా న‌టించింది. త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం ఐదేళ్ల కిందే 80 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఇప్పుడు త‌మిళ్ లో అక్క‌డ లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్ర రీమేక్ హ‌క్కుల‌ను తీసుకున్నారు. ఇదే విష‌యాన్ని అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేసారు కూడా. అయితే హీరోగా ఎవ‌రు న‌టిస్తార‌నే విష‌యంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. రీమేక్ స్పెష‌లిస్ట్ విజ‌య్ అప్ప‌ట్లోనే ఈ చిత్ర రీమేక్ లో న‌టించ‌న‌ని చెప్పాడు. దాంతో ఇప్పుడు త‌మిళ అత్తారింటిలోకి ఎవ‌రొస్తార‌నేది ఆస‌క్తి క‌రంగా మారింది. అజిత్ కోసం లైకా ప్రొడ‌క్ష‌న్స్ ట్రై చేస్తుంది. మొత్తానికి చూడాలిక‌.. అర‌వ అత్తారింట్లోకి ఏ హీరో అడుగు పెట్ట‌నున్నాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here