అర‌వగోల‌.. స‌ర్కార్ పై ఇది టూమ‌చ్..!


ఈ రోజుల్లో హీరోలు సినిమాల్లో సిగరెట్లు తాగ‌డం లేదా..? ఏ సినిమాలో చూసినా స్టైల్ కోస‌మైనా సిగ‌రెట్ అంటిస్తున్నారు క‌దా.. అలాగే మురుగ‌దాస్ కూడా విజ‌య్ తో చేస్తోన్న స‌ర్కార్ సినిమా ఫ‌స్ట్ లుక్ లో సిగరెట్ తాగుతున్న పోస్ట‌ర్ విడుద‌ల చేసాడు. దాన్ని ఇప్పుడు రాజ‌కీయ నాయ‌కులు కావాల‌నే ర‌చ్చ చేస్తున్నారు. విజ‌య్ లాంటి స్టార్ హీరో పొగ తాగ‌డాన్ని ఎంక‌రేజ్ చేస్తున్నాడంటూ ర‌చ్చ చేస్తున్నారు.
అస‌లు అందులో కాంట్ర‌వ‌ర్సీ చేయాల్సిన విష‌యం ఏముందో కానీ ఇప్పుడు ఈ ఇష్యూ కోర్ట్ వ‌ర‌కు వెళ్లింది. పైగా చెన్నై హై కోర్ట్ కూడా దీనికి స‌మాధానం ఇవ్వాల్సిందిగా చిత్ర యూనిట్ ను కోర‌డం విచిత్రం. పోస్ట‌ర్ పై వ‌చ్చిన వివాదాన్ని చూసి వెంట‌నే దాన్ని తీసేయించాడు మురుగ‌దాస్. కానీ త‌మిళ మాజీ ఆరోగ్య‌శాఖ మంత్రి అమ్బుమ‌ని మాత్రం విజ‌య్ పై కావాల‌నే క‌క్ష్య గ‌ట్టిన‌ట్లున్నాడు.
స్టార్ హీరో అయ్యుండి కావాల‌నే పొగ తాగ‌డాన్ని ఎంకరేజ్ చేస్తున్నావంటూ విజ‌య్ పై విరుచుకుప‌డ్డాడు. అదే ర‌జినీకాంత్.. అజిత్.. సూర్య లాంటి హీరోలు చేసిన‌పుడు ఈ నోరు ఎందుకు లేవ‌లేదో మ‌రి ఎవ‌రికీ అర్థ‌మే కావ‌డం లేదు. తుపాకి.. క‌త్తి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ త‌ర్వాత విజ‌య్ తో మురుగ‌దాస్ చేస్తోన్న సినిమా ఇది. స్పైడ‌ర్ డిజాస్ట‌ర్ కావ‌డంతో ఇప్పుడు మురుగ‌దాస్ కెరీర్ కూడా స‌ర్కార్ పైనే ఆధార‌ప‌డి ఉంది.
పైగా క‌త్తి.. తుపాకికి ముందు కూడా మురుగ‌దాస్ కు ఫ్లాపులు ఉన్నాయి. విజ‌య్ సినిమాతోనే మ‌ళ్లీ హిట్ కొట్టాడు ఈ ద‌ర్శ‌కుడు. స్పైడ‌ర్ తో పాటు దానికి ముందు అకీరా కూడా ఫ్లాపే. దాంతో ఈ రెండు ఫ్లాపుల్ని మ‌రిపించ‌డానికి ఇప్పుడు మురుగ‌దాస్ స‌ర్కార్ తో వ‌స్తున్నాడు. ఇది పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ తో వ‌స్తుంద‌ని తెలుస్తుంది. మొత్తానికి కాంట్ర‌వ‌ర్సీల ఊబిలో చిక్కుకుం టున్న స‌ర్కార్ ను ఎవ‌రు కాపాడ‌తారో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here